భారత సైన్యంలో కొన్ని ప్రత్యేకమైన శునకాలు సైతం దేశరక్షణలో నిమగ్నమైన ఉంటాయనే విషయం తెలిసిందే. అలా బార్డర్‌లో రక్షణగా ఉన్న ఒక స్నిఫర్ డాగ్ ఇటివల గర్భం దాల్చి.. మూడు పిల్లలకు సైతం జన్మనిచ్చింది. అయితే.. ఆ డాగ్ గర్భం దాల్చి, పిల్లల్ని కనడంపై ఆర్మీ అధికారులు విచారణకు ఆదేశించారు. విరాల్లోకి వెళితే.. మేఘాలయాలోని బంగ్లాదేశ్ సరిహద్దులో విధుల్లో ఉన్న శునకం లాల్సీ గర్భం దాల్చడంపై విచారణకు ఆదేశించారు అధికారులు. 43వ బెటాలియన్‌కు చెందిన ఈ స్నిఫర్ డాగ్ ఎలా గర్భందాల్చిందో దర్యాఫ్తు చేపట్టాలని బీఎస్ఎఫ్ షిల్లాంగ్ విభాగం డిప్యూటీ ఆఫీస్ కమాండెంట్ అజీత్ సింగ్ ఆదేశించారు. అదేంటి శునకం గర్భం దాల్చితే.. విచారణ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం ఏమిటంటే..
దేశ రక్షణలో ఉండే ఈ శునకాల విషయంలో ఆర్మీ అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఈ కాపలా శునకం లాల్సీ.. అత్యంత రక్షణ వలయంలో ఉంటూ నిరంతరం నిఘా ఉంచుతుంది. దీన్ని సాధారణంగా బయట తిరిగేందుకు ఆర్మీ అధికారులు అనుమతించరు. ఆర్మీ నిబంధనల ప్రకారం.. బీఎస్ఎఫ్ క్యాంప్, బార్డర్ పెట్రోలింగ్ సహా సరిహద్దుల దగ్గర విధుల్లో నియమించిన శునకాలను నిర్దేశిత ప్రాంతం నుంచి బయటకు వెళ్లేందుకు అధికారులు అనుమతించరు. ఆయా ప్రదేశాల్లో పటిష్టమైన సెక్యూరిటీ ఉంటుంది.
బయటి నుంచి కూడా ఎలాంటి జంతువులు లోపలికి రావు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత పటిష్టమైన భద్రతా వలయంలో ఉండే స్నిఫర్ డాగ్ లాల్సీ గర్భం ఎలా దాల్చిందని అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన విధుల్లో ఉన్న శునకాల పెంపకంలో ఆర్మీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వాటికిచ్చే ఆహారం మొదలుకొని క్రమం తప్పకుండా వేసే టీకాల వరకు అంతా వాటి పర్యవేక్షకుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అయినా కూడా ఒక ముఖ్యమైన శునకం విధుల్లో ఉంటూనే గర్భం దాల్చడంపై ఆర్మీ విస్మయం వ్యక్తం చేస్తూ.. విచారణ చేపట్టారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.