ఇటీవల కురుస్తోన్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయినా కొన్ని చోట్ల జనాలు రిస్క్ చేసి మరి పడవ ద్వారా నదులు దాటుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా యూపీలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్‌ప్రదేశ్‌లో బాందా జిల్లాలోని యమునా నదిలో గురువారం ఓ పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బోటులో 50 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. ఫతేపూర్ నుంచి మార్కా వెళ్లేందుకు పడవలో నది దాడుతుండగా పడవ బోల్తా పడింది. బరువు ఎక్కువ కావడంతో నది మధ్యలో పడవ బ్యాలెన్స్ తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికిచేరి సహయ చర్యలు చేపట్టారు. పలువురి ఆచూకీ గల్లంతైనట్లు చెప్పారు.
यमुना नदी में डूबी नाव,20 लोग लापता, 50 से ज्यादा लोग थे सवार, हादसे पर सीएम योगी ने जताया शोक #YogiAdityanath #Banda #YamunaRiver @anujlive08
For More Updates : https://t.co/pIT1flVPIx pic.twitter.com/Jd0qcDxgmE
— Zee Uttar Pradesh Uttarakhand (@ZEEUPUK) August 11, 2022