బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు అనేక మంది సినీ రంగ ప్రముఖులు ఇటీవల తుదిశ్వాస విడిచారు. తాజాగా మరో నటి కన్నుమూశారు. థియేటర్ ఆర్టిస్ట్ నుండి వెండి తెరపైకి వచ్చి పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఓ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డును పొందారు.
సినీ పరిశ్రమను వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ మూడు నెలల కాలంలో అనేక సమస్యలతో పలువురు ప్రముఖులు తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అనేక మంది కన్నుమూశారు. దర్శకులు విశ్వనాథ్, సాగర్, నటులు జమున, తారకరత్న, సింగర్ వాణి జయరాంతో పాటు తమిళ కమెడియన్ మయిలు స్వామి, మలయాళ యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్‌తో పాటు అటు బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకులు సతీష్ కౌశిక్, ప్రదీప్ సర్కార్ మృతి చెందిన సంగతి విదితమే. ఇప్పుడు తాజాగా మరో నటి లేరన్న వార్త సినీ పరిశ్రమను విషాదంలో నింపింది.
బాలీవుడ్ ప్రముఖ నటి, థియేటర్ ఆర్టిస్ట్ ఉత్తరా బావోకర్ (79) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బావోకర్ మహారాష్ట్రలోని పూణెలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD)లో.. స్టూడెంట్‌గా.. నటనను అభ్యసించిన ఉత్తరా బావోకర్ అనేక నాటకాల్లో కీలక పాత్రలను పోషించారు. ముఖ్యమంత్రి నాటకంలో పద్మావతి పాత్ర, మేనా గుర్జారి నాటకంలో టైటిల్ రోల్ మేనా పాత్రతో పాటు షేక్స్ పియర్ రచించిన ఒథేల్లో నాటకంలో డెస్టెమోనా పాత్రలో ఆమె అద్భుతంగా నటన కనబర్చారు. దక్షిణాదిలో ప్రముఖ రచయిత గిరీష్ కర్నాడ్ రచించిన తుగ్లక్ నాటకంలో తల్లి పాత్రలో ఆమె నటనను చూసి ప్రేక్షకులను ఫిదా చేశారు.
గోవింద్ నిహ్లానీ చిత్రం తమస్‌తో వెండితెరపైకి అడుగుపెట్టారు. సుమిత్రా భావే చలనచిత్రాలలో కూడా బావోకర్ నటించారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సునీల్ సుక్తాంకర్ నిర్మాణంలోనే బావోకర్ దాదాపు ఎనిమిది సినిమాల్లో పనిచేశారు. బావోకర్ మృణాల్ సేన్ యొక్క ‘ఏక్ దిన్ అచానక్’లో నటనకు గానూ.. 1988లో ఆమె ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. ఆమె ఆజా ‘నాచ్లే, జస్సీ జైస్సీ కోయి నహిన్, వంటి షోస్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. కాగా ఉత్తరా బావోకర్ యాత్ర, రుక్మావతి కి హవేలీ, ది బర్నింగ్ సీజన్, ఉత్తరాయణ్, కోరా కాగజ్, సంహిత, ఎక్కీస్ తోప్పోన్‌కి సలామీ, దేవ్ భూమి వంటి చిత్రాల్లో నటించారు. ఆమె అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.
When I first saw her on stage as Umrao Jaan, I fell in love. Many years later, when I met in 2017, found her simplicity and warmth beyond imagination. She used to call me just because she watched some epi of Guftagoo and liked it.
RIP #UttaraBaokar@abhinavmania @AnirbanCamera pic.twitter.com/cOW0tGf74f— Irfan (@irfaniyat) April 12, 2023
Demise of Uttara Baokar Ji is an irreparable loss to Indian Film Industry. Deeply pained by her demise. ॐ शांति pic.twitter.com/nX0IMevO3P
— Manoj Joshi (@actormanojjoshi) April 12, 2023