ప్రముఖ విలక్షణ నటుడు రావు గోపాలరావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రావు రమేష్. నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చకున్నారు. విలన్ గా, సహాయక నటుడిగా, తండ్రిగా, కమెడియన్ గా మెప్పించారు. ఇప్పుడు ఆయన ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నారు.
‘మనిషన్కాక కాస్తంత కళా పోషణ ఉండాల’అనే ఒక్క డైలాగ్‌తో గుర్తుకు వస్తారు రావు గోపాలరావు. విలక్షణ నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు రావు రమేష్. ఎక్కడా తన నాన్న పేరును చెప్పకుండా ఎదిగారు. తొలుత టీవీ సీరియల్లో నటించిన ఆయన ఆ తర్వాత వెండి తెరపైకి వచ్చారు. విలన్‌గా, తండ్రిగా, సహాయక పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కూడా బహుముఖ నటుడిగా పేరు సంపాదించారు. ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నారు.
ఇప్పుడు రావు రమేష్ హీరోగా ఎంట్రీ కాబోతున్నారు. ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ పేరుతో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఫంక్తు ఫ్యామిలీ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో ఆయనే లీడ్ రోల్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. పీబీఆర్ సినిమాస్ బ్యానర్‌పై ‘హ్యాపీ వెడ్డింగ్’ ఫేమ్ లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రముఖ నటి ఇంద్రజ నటించబోతున్నారు. వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కబోతోంది. ఈ సినిమా కథ మొత్తం ఒక మధ్య వయసు నిరుద్యోగి జీవితం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.
రావు రమేష్ 2002లో బాలకృష్ణ మూవీ సీమ సింహం సినిమాతో తెరకు ఎంట్రీ ఇచ్చారు. అక్కడ నుండి చిన్న చిన్న పాత్రలు, విలన్ పాత్రలు చేసుకుంటూ వచ్చారు. ఆయనకు పేరు తెచ్చిందీ మాత్రం కొత్త బంగారు లోకం. అందులో కాలేజీ లెక్చరర్ గా ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ మెప్పిస్తుంటాయి. ఆయన విలనీజం కానీ, కామెడీ టైమింగ్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రస్టేషన్ కూడా బాగా పలికిస్తారు. అక్కడ నుండి మొన్న వచ్చిన ధమాకా మూవీ వరకు మెప్పిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సౌత్ లో బెస్ట్, బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. అటు ఇంద్రజ సైతం పెద్ద హీరోల పక్కన చేసి.. పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన ఆమె పలు టీవీ షోలతో పాటు సినిమాలు చేస్తున్నారు.
A fresh & Super Fun😀
Family entertainer is coming your way to tickle your funny bones😉Everyone’s favourite #RaoRamesh garu& @lakshmankarya are teaming up for a crazy entertainer,Titled #MarutiNagarSubramanyam!
Shoot commences from March🎥@PBRCinemasinfo @Rushi2410#Indraja pic.twitter.com/OkojW0qko8
— BA Raju’s Team (@baraju_SuperHit) February 24, 2023