ఫిల్మ్ డెస్క్- RRR.. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. బాహూబలి లాంటి పాన్ ఇండియా సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో ఆందరిలో ఆసక్తి పెరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన చిత్రమిది. 1920 బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ.
ఈ సినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్‌తో పాటు సముద్ర ఖని, శ్రియా శరన్ వంటి వారు హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, ఒలివియా మోరిస్ తదితరులు నటించారు. భారీ అంచనాల మధ్య జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సిన RRR సినిమా వాయిదా పడింది. రిలీజ్‌కు వారం రోజులు కూడా లేని సమయంలో మేకర్స్ సినిమా విడుదలను మరోసారి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో, పరిస్థితి అదుపు తప్పకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఈ మేరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్స్, షాపింగ్ మాల్స్, థియేటర్స్‌ను పూర్తిగా మూసి వేస్తుంటే, కొన్ని రాష్ట్రాలు మాత్రం థియేటర్స్‌ను 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేసుకోవచ్చునని అంటున్నాయి. ఈ క్రమంలోనే RRR మేకర్స్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు జల్లినట్లైంది. అసలే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కదా, ఇలా వియదాల మీద వాయిదాలు పడటంతో అసహనానికి గురవుతున్నారు. తమదైన స్టైల్లో సోషల్ మీడియాలో మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. RRR మేకర్స్‌ను అభిమానులు, నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. రాజమౌళి సినిమాలోని సీన్స్ తోనే సెటైరిక్ మీమ్స్ చేస్తున్నారు.
@tarak9999 Fans 💔#RRRPostponed#RRRMovie pic.twitter.com/HvMDhmqmi9
— 🖤బాలాజీ నాయుడు 🖤🌊🌊 (@Balunaidu71) January 1, 2022
#RRRPostponed changing dates be like pic.twitter.com/vINon9Mt6E
— RRR.Dhanu2123™🌊 (@dhanu9992) January 1, 2022
DVV signing Checks for promotion again#RRRpostponed #RRR pic.twitter.com/6NO2U78bsy
— OliviaMorris_Stan (@Watchmen_dr_man) January 1, 2022
#RRRonJan7th #RRR #RRRpostponed
When RRR started When RRR releases pic.twitter.com/Q1X43VS4yi
— Dr Humour (@humourdoctor) January 1, 2022
It’s official now.. 🥲#RRRPostponed pic.twitter.com/TvYJdEVnjY
— Whynot Cinemas (@WhynotCinemas) January 1, 2022