సినిమా అంటే రంగుల ప్రపంచం మాత్రమే కాదు. ఇక్కడ కూడా కష్టం ఉంటుంది. కన్నీరు ఉంటుంది. అభాగ్యులు ఉంటారు. మొత్తంగా సినిమా రంగం అంటేనే అన్ని రకాల ఎమోషన్స్ కలసి ఉంటాయని అర్ధం. కానీ.., ఒకప్పుడు బాగా బతికిన కళాకారులు జీవితంలో చేసిన తప్పుల కారణంగా, వృద్దాప్యం కారణంగా, అనారోగ్య సమస్యల కారణంగా చివరి దశలో నానా అవస్థలు పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనసు కదలిపోతుంటుంది. అచ్చం ఇలాంటి కథే.. నటి పావలా శ్యామలాది. సీనియర్ ఆర్టిస్ట్ గా ఈమె 250 చిత్రాలకి పైగా నటించింది. అగ్ర హీరోలు అందరితో కలసి సినిమాలు చేసింది. కానీ.., జీవితంలో ఆర్ధికంగా స్థిరపడలేకపోయింది. ఇప్పుడు కూడా ఆమెది ఇదే పరిస్థితి. ఒకవైపు కుమార్తె అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక సమస్యలు ఆమెను తెగ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చివరకు ఇంటి అద్దె కూడా కట్టలేని దీనమైన స్థితిలో ఆమె ఉన్నారు. గడిచిన మూడు నెలలుగా ఇంటి అద్దెను కట్టలేని దీన స్థితిలో ఉన్నారు. తాజాగా మరో నటి కరాటే కళ్యాణి ఆమెకి సరుకువులు అందివ్వడానికి స్వయంగా ఇంటికి వెళ్లారు. అక్కడ.., వణికిపోతున్న దేహం, చినిగిపోయిన బట్టలు, సన్నగా అయిపోయిన పావలా శ్యామలాని చూసి ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో.., పావలా శ్యామలాని సినీ పెద్దలు ఆదుకోవాలని అంతా కోరుకున్నారు. ఇప్పుడు ఆ ప్రార్ధనలు ఫలించాయి. పావలా శ్యామలని ఆదుకోవడనికి మెగాస్టార్ చిరంజీవి ముందుకి వచ్చారు.
పావలా శ్యామలకు ‘మా’ అసోసియేషన్ సభ్యత్వంతో పాటు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు చిరంజీవి. కరాటే కళ్యాణి, సురేష్ కొండేటి శ్యామల ఇంటికి వెళ్ళి చిరంజీవి తరుపున రూ. 1,01,500 సహాయాన్ని అందించారు. అలాగే ‘మా’ మెంబర్ షిప్ కార్డు కూడా ఇచ్చారు. దీనితో ఆమెకి ఇక నుండి నెలకు రూ. 6 వేల చొప్పున ఫించను రానుంది. దీంతో పాటు.., పావలా శ్యామల కూతురి వైద్యానికి సంబంధించి న్యూరో సిటీ సెంటర్ వైద్య నిపుణులు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. చిరంజీవి చొరవతోనే ఇవన్నీ సాధ్యం అవ్వడం విశేషం. ఇక ఈ విషయంపై పావలా శ్యామల స్పందించింది. గతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె నాకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈ కష్టంలో ఉన్న నాకు మరోసారి రూ. లక్షా పదిహేను వందల రూపాయలను చెక్ రూపంలో అందించారు. అంతేకాకుండా ప్రతి నెలా ఆరువేల రూపాయలు సాయం అందించేందుకు సాయపడ్డారు. మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి నా ధన్యవాదాలు అంటూ పావలా శ్యామలా ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఇక మొన్నటికి మొన్న టి.ఎన్.ఆర్ కుటుంబానికి కూడా చిరంజీవి లక్ష రూపాయలు సహాయం చేసిన విషయం తెలిసిందే. దీనితో.., ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారిన మెగాస్టార్ పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి.. చిరు చేసిన ఈ మంచి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.