టాలీవుడ్ లో మెగా హీరోల లిస్ట్ కాస్త పెద్దదే. వీరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ మాత్రం ప్రత్యేకం. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన చరణ్ తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్నాడు. ఇక ఈ జనరేషన్ టాప్ స్టార్ అయిన రామ్ చరణ్ లైఫ్ స్టయిల్ ఓ రేంజ్ లో ఉంటుంది. చరణ్ వాడే బ్రాండెడ్ థింగ్స్ కి లక్షల్లో ఖర్చు అవుతుంటాయి. ఇంత వరకు అందరికీ తెలిసిందే. అయితే.., రామ్ చరణ్ దగ్గర పని చేసే కార్ డ్రైవర్ కి ఎంత జీతం ఉంటుంది? ఇది చాలా మందికి సమాధానం తెలుసుకోవాలి అనిపించే ప్రశ్న.
ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది కార్మికులు జీవన ఉపాధిని కోల్పోయారు. మరి కొంత మందికి శాలరీస్ లో కొత విధించారు. అయితే.. రామ్ చరణ్ మాత్రం తన దగ్గర ఉండే స్టాఫ్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాడట. ఈ విషయంలో చరణ్ కి మెగాస్టార్ చిరంజీవి ఆదర్శం. చిరు మొదటి నుండి తన దగ్గర పని చేసే వారికి ఎలాంటి కష్టం రానివ్వరు. వారి బాధ్యతలన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు చరణ్ కూడా తన దగ్గర పని చేసే వారి విషయంలో ఇలానే మంచి మనసు చాటుకుంటున్నాడట.
ఇక రామ్ చరణ్ తన కార్ డ్రైవర్ కి సుమారు రూ.45000 జీతం ఇస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ కటింగ్స్ పోగా.., ఈ మొత్తం అమౌంట్ డ్రైవర్ కి అందుతున్నట్టు సమాచారం. అయితే.., ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. చరణ్ గాని, ఉపాసన గాని బయటకి వెళ్లే సమయంలో సెల్ఫ్ డ్రైవ్ చేసుకోవడానికే ఇష్టపడతారు. డ్రైవర్ ని వాడేది అతికొద్దీ సందర్భాల్లో మాత్రమే. ఈ కారణంగానే చరణ్ దగ్గర పని తక్కువ, జీతం ఎక్కువ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ట్రిపుల్ ఆర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటు శంకర్ డైరెక్షన్‌లో ఓ పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు.