ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా స్పందించేది చిరంజీవే. ఇక ఎవరైనా మంచి పని చేసినా వారిని ప్రత్యేకంగా అభినందిస్తారు మెగాస్టార్. మరి అదే తమ కుటుంబ సబ్యులెవరైనా ఓ పని చేస్తున్నారంటే ఎంకరేజ్ చేయకుండా ఉంటారా చెప్పండి. నాగాబాబు కూతురు నిహారికకు చిరంజీవి విషేస్ చెప్పారు.
కొణిదెల వారి ఆడబడుచు నిహారికకు శుభాకాంక్షలు.. అంటూ చిరంజీవి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రత్యేకంగా నిహారికని చిరు అలా సంభోధించటం చూసి, ఆమె ఏమైనా గుడ్ న్యూస్ చెప్పిందేమో అని భావిస్తున్నారు. అందుకే చిరంజీవి ఆ టైపులో శుభాకాంక్షలు చెప్పారని అనుకుంటున్నారు. ఐతే అంతా అనుకుంటున్నట్లు నిహారిక అలాంటి శుభవార్త ఏమీ చెప్పలేదు. నిహారిక నిర్మించిన.. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ.. వెబ్ సిరీస్ చిరంజీవికి బాగా నచ్చింది.
ఎంతో వినోదాత్మకంగా ఉందంటూ నిహారికకి, వెబ్ సిరీస్ యూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా, పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకంపై నిహారిక కొణిదెల నిర్మించిన ఈ వెబ్ సిరీస్ జీ 5 ఓటీటీలో నవంబర్ 19న విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ కు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ని చూసిన చిరంజీవి ట్విట్టర్ లో యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు.
చిరంజీవి ఏమన్నారంటే.. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూశాను.. ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉంది.. నిర్మాణంలో తన తొలి ప్రయత్నంలోనే ఇంత హృద్యంగా, వినోదాత్మకంగా తీసి ప్రేక్షకులని మెప్పిస్తున్న కొణిదెల వారి ఆడబడుచు నిహారికకి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టీమ్ అందరికీ నా అభినందనలు.. మీరిచ్చిన ఈ స్పూర్తితో తను మరిన్ని జనరంజకమైన చిత్రాలను నిర్మించాలని కోరుకుంటూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. అని ట్వీట్ లో పేర్కొన్నారు చిరంజీవి. ఈ సిరీస్‌కు ఇప్పటి వరకు 6 కోట్ల నిమిషాల వ్యూస్ వచ్చినట్లుగానూ జీ5 తెలిపింది.
@IamNiharikaK #OkaChinnaFamilyStory #Okachinnafamilystory @ZEE5Telugu #pinkelephantpictures #Sangeethshoban #SimranSharma #Maheshuppala #manasasharma pic.twitter.com/Dd63wNgIKn
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 29, 2021