భారత్,ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం ఓవల్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా జట్టుని తెలుగు బౌలర్ సిరాజ్ మెరుపు బౌలింగ్ తో ఆసీస్ ని హడలెత్తిస్తున్నాడు. ఈ పేసర్ ధాటికి వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ కి సైతం గాయం అయింది.
భారత్,ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం ఓవల్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుంది. పిచ్ పేస్ బౌలింగ్ కి అనుకూలంగా ఉండడంతో టీమిండియా.. ఈ మ్యాచులో అశ్విన్ కి నిరాశ తప్పలేదు. షమీ, ఉమేష్ యాదవ్, సిరాజ్, శార్ధూల్ లాంటి నలుగురు నిఖార్సైన ఫాస్ట్ బౌలింగ్ తో భారత్ ఈ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. భారత్ కి ఇది వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ కాగా.. ఆసీస్ కి ఇదే తొలి ఫైనల్. ఇక ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ కి భారత్ బౌలర్లు ప్రస్తుతం తమ పేస్ తో ముప్పు తిప్పలు పెడుతున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత్ అనుకున్నట్లుగానే నలుగురు పేసర్లను రంగంలోకి దింపింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆసీస్ బౌలర్లకు భారత్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. మొదటి 10 ఓవర్లు ముగిసేసరికి కేవలం 22 పరుగులు చేసి కీలకమైన ఖవాజా వికెట్ ని కోల్పోయింది. ముఖ్యంగా తెలుగు కుర్రాడు మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం అత్యున్నత ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అదే ఫామ్ ని కొనసాగిస్తున్న సిరాజ్.. ఈ మ్యాచులో నిప్పులు చెరిగే బంతులు వస్తూ కంగారులని హడలెత్తిస్తున్నాడు. ఫామ్ లో ఉన్న ఖవాజాని పెవిలియన్ కి పంపడమే కాకుండా.. వరల్డ్ టాప్ బ్యాటర్ లబు షేన్ సైతం సిరాజ్ బౌలింగ్ లో ఇబ్బందులు ఎదర్కొంటున్నాడు. ఈ క్రమంలో సిరాజ్ వేసిన ఒక బంతి లబు షేన్ చేతికి బలంగా తగలడంతో కాసేపు నొప్పితో విలవిల్లాడాడు. సిరాజ్ తో పాటు భారత పేసర్లు ఇదే జోరుని కొనసాగిస్తే ఈ మ్యాచ్ పై పట్టు సాధించవచ్చు. మొత్తానికి సిరాజ్ స్పెల్ మొదటి గంటలో హైలెట్ గా నిలిచింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
A brutal blow.
Siraj and Shami getting the uneven bounce! pic.twitter.com/DiUWZUfj2y
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 7, 2023