ఫిల్మ్ డెస్క్- కరోనా మహమ్మారికి తన మన బేదం లేదు. సామాన్యులు, సెబ్రిటీలన్న అంతరం అస్సలే లేదు. కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వార తెలియజేసిన సంగతి తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని. ఐతే ఎవ్వరు ఆందోళన చెందవద్దని, తనతో పాటు తన కుటుంబ సభ్యులంతా హోంఐసొలేషన్ లో ఉన్నామని చెప్పారు ఎన్టీఆర్. తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించిన ఎన్టీఆర్.. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
ఇక ఎన్టీఆర్ కు కరోనా సోకిందని తెలియగానే సినీ ప్రముఖులతో పాటు అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలి బ్రదర్ అంటూ ప్రిన్స్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్ అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ లో ఆకాంక్షించారు. వీళ్లే కాకుండా చాలా మంది ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు. తారక్ అభిమానులైతే తమ అభిమాన నటుడు ఆరోగ్యంగా ఉండాలంటూ ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు.