ఇంటర్నేషనల్ డెస్క్- తొమ్మిది నెలలు బిడ్డను మోసి బిడ్డను ప్రసవించడం ఒక్క అమ్మకు మాత్రమే సాధ్యం. ఇక బిడ్డను ప్రసవించేటప్పుడు ఆ బాధ ఆడవాళ్లకు మాత్రమే తెలుసు. బిడ్డను కనడమంటే ఆడది చనిపోయి మళ్లీ పుట్టడం అని అందుకే అంటారు. ఇక బిడ్డ ప్రసవం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి త్వరగా ప్రసవం ఐతే.. మరి కొందరికి ప్రసవానికి చాలా సమయం తీసుకుంటుంది. డెలివరీ విషయంలో ఒక్కోసారి డైక్టర్ల అంచనాలు సైతం తప్పుతుంటాయి. వైద్యులు అంచనా వేసిన సమయం కంటే ముందుగానో.. లేక ఆలస్యంగానో ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక గర్బిణీలకు సులబంగా ప్రసవం అవ్వడానికి తాము తయారు చేసిన బర్గర్ తీనాలంటున్నారు సబ్ అర్బన్ రెస్టారెంట్ నిర్వాహకులు. అమెరికాలోని మిన్నెసోటాలో ఉన్న సబ్ అర్బన్ రెస్టారెంట్ లో ఈ ప్రత్యేకమైన బర్గన్ను తయారు చేస్తున్నారు. దీన్ని ప్రత్యేకంగా లేబర్ ఇండ్యూసర్ బర్గర్ అని పిలుస్తారు.
అలాగని ఈ బర్గర్ కేవలం గర్బిణీలకు మాత్రమే అనుకుంటే పొరపాటే.. ఎవరైనా తినవచ్చు. ఇప్పటివరకు ఈ బర్గర్ తిని సుమారు 31 మంది సులువుగా బిడ్డలను ప్రసవించారని సబ్ అర్బన్ రెస్టారెంట్ యాజమాన్యం చెబుతోంది. ఈ బర్గర్ తయారు చేసేందుకు లోబీఫ్, పంచదార పాకంలో వేయించిన ఆనియన్స్, మసాలా సాస్, ఆవాలు, తేనెలో ముంచిన పంది మాంసం ముక్కలను వాడతారట. ఈ రెస్టారెంట్ లో 2019 నుంచి ఈస్పెషల్ బర్గర్ ను తయారు చేస్తున్నారు. సబ్ అర్బన్ రెస్టారెంట్ యజమాని కూతుళ్లు ఇద్దరు ఈ బర్గర్ తిని పండంటి పిల్లలను కన్నారట. నెలలు నిండిన గర్భిణీ మహిళలు ఈ బర్గర్ తిన్న 24 గంటల్లో బిడ్డను కనేస్తారని వీళ్లు చెబుతున్నారు. కానీ డాక్టర్ల సూచనలు లేకుండా గర్బిణీ స్ర్తీలు ఇలాంటి ఆహారం తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.