సాధారణంగా ఎవరైనా పామును చూసి ఆమడ దూరం పారిపోతారు. విష సర్పాలు అంటే ఎవరికైనా ఎంతో భయం. పాము ఉందని తెలిస్తే చాలు.. ఆ చుట్టు పక్కలకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతారు. అలాంటిది ఓ త్రాచు పాముతో చిన్న పిల్లాడు ఒక్క ఆట ఆడుకున్నాడు. అత్యంత ప్రమాదకరమైన రక్త పింజరి పారిపోతున్నా తోక పట్టుకొని మరీ ఆడించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతానికి నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఒక చిన్న పిల్లాడు ఐదు అడుగుల పొడవు ఉన్న పాముతో ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఏమాత్రం భయపడకుండా దాని తోక పట్టుకొని లాగడంతో పాము గిల గిల కొట్టుకొని ఎలాగో అలా విడిపించుకుంది. అయినా ఆ పిల్లాడు దాన్ని వదలకుండా పట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇప్పుడే ఇంత ధైర్యంగా ఉన్నాడంటే పెద్దయ్యాక ఎన్ని సాహసాలు చేస్తాడో అని తెగ మెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లలను చూడాలని అంటున్నారు మరికొంత మంది నెటిజన్లు.