మనిషికి మూగ జీవాలకు ఎంతో అనుబంధ ఉంటుంది. మానవు జీవితంలో మూగ జీవాల పాత్ర ఎంతో ఉంటుంది. ముఖ్య రైతులకు వ్యవసాయ పనుల్లో పశువులు అండగా ఉంటాయి. ఎద్దులు, ఆవులు, గేదెలు వంటి మొదలైన జీవాలను రైతు.. తన కుటుంబంలో సభ్యులుగా భావిస్తాడు. ఆ ఇంటి పిల్లలు కూడా ఆ జీవాలకు ఆహారం వేస్తూ స్నేహం చేస్తుంటారు. అలా రైతు కుటుంబానికి, మూగ జీవాలకు మధ్య ప్రేమానుబంధాలు ఏర్పడతాయి. అలాంటి ప్రేమానురాగాలకు నిదర్శనం ఆవు ఒడిలో ఆడుకుంటున్న బాలుడు. ఆ బుడతడు ఆవు పై ఎంత పడుతున్న.. అది మాత్రం ఏమాత్రం కదలకుండా, బాలుడికి హాని చేయకుండా మౌనంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంకిత అనే ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ఈ వీడియో అందరిని ఆకట్టుకుంది. ఈవీడియోలో పడుకున్న ఆవు వద్దకు బాలుడు వెళ్లి.. దానితో ఆటలు ఆడుతుంటాడు.ఈ క్రమంలో దాని కాళ్ల వద్దకు, కొమ్ముల వద్దకు వెళ్లి కూర్చుంటాడు. దాని మెడ వద్దకు వెళ్లి.. అక్కడ తన తలపెట్టిపడుకుంటాడు. ఈ బుటతడు ఏమి చేస్తున్నా.. ఆవు మాత్రం ఇసుమంతైన కదల్లేదు. ఈ సీన్ చూసిన వాళ్లందరూ..ఈ ఇద్దరిది అంతలేని ప్రేమా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఎంతటి బలవంతుడు వచ్చిన తన కొమ్ములతో విసికొట్టే.. ఆ ఆవు .. ఆ బుడతడిని మాత్రం ఏమి అనడంలేదు. హద్దులులేని ప్రేమానుబంధం అని క్యాప్షన్ తో అంకిత అనే నెటిజన్ల ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి… మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Bond of unconditional love ! ❤️ pic.twitter.com/Btgik7aIfO
— Ankita (@AnkitaBnsl) July 19, 2022
ఇదీ చదవండి: దారుణం: DSP ర్యాంకు పోలీస్‌ను రాళ్ల లారీతో తొక్కి చంపిన మైనింగ్ మాఫియా
ఇదీ చదవండి: వానదేవుడిపై చర్యలు తీసుకోవాలంటూ రైతు లేఖ.. పై అధికారికి సిఫార్సు చేసిన రెవెన్యూ అధికారి!
ఇదీ చదవండి: వీడియో: నేషనల్ హైవేపై అలవోకగా లారీ నడిపిన మహిళ.. ఆమె కాన్ఫిడెన్స్‌పై నెటిజనుల ప్రశంసలు!