స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అసలు మహిళ లేకుండా మానవ మనుగడ అసాధ్యం. స్త్రీలను గౌరవించాలని మన పురాణాలు, వేదాలు చెబుతాయి. ఆడవారిని గౌరవించని సమాజం అభివృద్ధి చెందదు అంటారు. నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దేశాలను పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టం అవుతుంది. ఆ దేశాల్లో మహిళలకు మగవారితో సమాన హక్కులు, రక్షణలు ఉంటాయి. మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తారు. ఆడవారికి అధిక ప్రాధాన్యత ఇచ్చి.. వారి సంక్షేమం, భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణాయలు తీసుకుంటాయి కనుక ఆయా దేశాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో మగవారితో పోటీ పడుతున్నారు. అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నారు. మగవారితో పోల్చుకుంటే తాము ఎందులో తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో మహిళా సాధికారతకు నిలువటద్దంలా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు.. సాధారణంగా డ్రైవింగ్ అనగానే అది మగవారి పని అనుకుంటారు. అయితే మారుతున్న కాలంతో పాటు.. మహిళలు కూడా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఎందరో మహిళలు, యువతులు టూవీలర్, కారు వంటివి డ్రైవ్ చేస్తున్నారు. కొందరు బస్సుల, ఆటోలు కూడా నడుపుతూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇప్పుడు మీరు చూడబోయే మహిళ ఏకంగా 16 చక్రాల లారీని.. అది కూడా నేషనల్ హైవే మీద ఎలాంటి బెరుకు లేకుండా ఎంతో కాన్ఫిడెన్స్‌తో డ్రైవ్ చేస్తోంది. మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలరు అని ఆమె నిరూపిస్తోంది. దాంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన వారు సదరు మహిళ కాన్ఫిడెన్స్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్విట్టర్ లోని karthik_nmkl అకౌంట్లో జులై 15, 2022న ఈ వీడియోని పోస్ట్ చేశారు. "ఆ నవ్వు చూడండి" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో ఓ మహిళ హైవేపై ఎంతో కాన్ఫిడెన్స్‌తో లారీ నడుపుతోంది. ఆమె మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో... ఆ వాహనంలోని వ్యక్తి ఆమెను చూసి ఆశ్చర్యపోతూ... వీడియో రికార్డ్ చేశారు. అలా వీడియో తీస్తున్న వ్యక్తిని చూసిన ఆమె... సరదాగా నవ్వేసింది. ఆ నవ్వు ఆమెలో కాన్ఫిడెన్స్‌ని చూపిస్తోంది. అలా నవ్వుతూ ఆమె ఏమాత్రం బెదురు అన్నది లేకుండా లారీ నడుపుతూ దూసుకెళ్లింది. That smile pic.twitter.com/IGWb5I7COv — தீரன் (@karthik_nmkl) July 15, 2022 ఈ వీడియోని ఇప్పటికే 1.96 లక్షల మందికి పైగా చూడగా... 8.8 వేల మందికి పైగా లైక్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "జీవితం అంటే విజయం, ఆనందమే. ఆమెకు సెల్యూట్ చేస్తున్నా" అని ఓ యూజర్ కామెంట్ చేయగా ‘‘జీవితం అంటే నువ్వు ఏది కోరుకుంటే అదే’’... ‘‘ఆమె ఎంతో ఎనర్జీతో బండి నడుపుతోంది’’.. "ఆమె నడుపుతున్నది మామూలు లారీ కాదు. దానికి 16 చక్రాలున్నాయి. అంత పెద్ద లారీని నేషనల్ హైవేపై ఓ మహిళ ధైర్యంగా నడుపుతోంది. ఆమె నవ్వు అద్భుతం’’.. ‘‘భారతీయుల్లో వినూత్న మహిళ. ఆమె మహిళా శక్తి’’ అంటూ నెటిజనులు సదరు మహిళపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నీ ఆత్మవిశ్వాసం ఎందరికో ప్రేరణ అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Cuddle Therapy: అతడి కౌగిలికి భలే డిమాండ్.. గంటకు రూ. 7వేలు! ఇది కూడా చదవండి: వైరల్ వీడియో: ఇదేం గొడవ రా బాబు!.. ప్రియుడి కోసం యువతుల స్ట్రీట్ ఫైట్!