ఫిల్మ్ డెస్క్- తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులుగా విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తామిద్దరు పరస్పర అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేధికగా తెలిపారు ధనుష్, ఐశ్వర్య. వివాహం అయిన 18ఏళ్ల తరువాత వీళ్లు విడాకులు తీసుకుంటుండటం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
ఐతే ఇటువంటి సమయంలో హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఇందుకు భిన్నంగా కామెంట్ చేశారు. ధనుష్, ఐశ్వర్య విడాకులపై ఆయన స్పందించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కస్తూరి రాజా.. ఆ దంపతులు భిన్నాభిప్రాయాలను పరిష్కరించుకుని త్వరలోనే కలిసి పోయే అవకాశం ఉందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఏమన్నారంటే.. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సాధారణం.. అటువంటి గొడవలే వీరిద్దరి మధ్య చోటు చేసుకున్నాయి.. ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో లేరు.. హైదరాబాద్ లో ఉన్నారు.. ఫోన్‌లో వారితో మాట్లాడాను.. కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాను.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా విడాకుల నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని వారిద్దరిని కోరారు..
సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలెబ్రిటీలు పిల్లల భవిష్యత్తు రీత్యా విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.. అని కస్తూరి రాజ చెప్పుకొచ్చారు. మరి ఇద్దరు తమ తమ తండ్రుల మాటను గౌరవించి విడాకుల నిర్ణయంపై ఏమేరకు ధనుష్, ఐశ్వర్య పునరాలోచిస్తారన్నదే ఉత్కంఠ రేపుతోంది.
🙏🙏🙏🙏🙏 pic.twitter.com/hAPu2aPp4n
— Dhanush (@dhanushkraja) January 17, 2022