నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిన్ లు నటించిన సూపర్ డూపర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ ‘జాతిరత్నాలు’. ఈ ముగ్గురు కలిసి చేసిన కామెడీకి బాక్సాఫీస్ రికార్డులు షేక్ అయ్యాయి. అయితే జాతి రత్నాలు అనే ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కసారి తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు అనుదీప్. ఫుల్ లెంత్ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా చిన్న చిత్రంగా వచ్చి అఖండ విజయం అందుకుంది. జాతిరత్నాలు ప్రేక్షకుల నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఎంతలా అంటే జాతిరత్నాలు సినిమా చూసి థియేటర్ల నుంచి బయటకి వచ్చే వరకు ఆడియన్స్ తెగ నవ్వుకున్నారు. దీంతో రెండో సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో టాలీవుడ్ టాప్ హీరోల కన్ను అనుదీప్ పై పడింది. ఈక్రమంలో ఈ డైరెక్టర్ విషయంలో అనేక రకాల వార్తలు షికార్లు చేశాయి. విక్టరీ వెంకటేశ తో అనుదీప్ ఓ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇక కామెడీకి కొరత ఉండదంటూ ఈ విషయం తెలిసిన కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అనుదీప్ 2016లో వచ్చిన ‘పిట్టగోడ’ చిత్రంతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను పెద్ద ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత వచ్చిన జాతిరత్నాలు చిత్రంతో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీంతో అనుదీప్ దర్శకత్వంలో నటించేందుకు పెద్ద పెద్ద హీరోలు ముందుకు వస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది. అనుదీప్ తో విక్టరీ వెంకటేశ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అనుదీప్ వెంకీ మామను కలిసి స్టోరీ ఐడియా కూడా చెప్పేశారని సమాచారం. ఆ కథ ప్లాన్ వెంకటేశ్‌కు కూడా నచ్చిందని సమాచారం. త్వరలో పూర్తి కథను వినిస్తారని తెలుస్తోంది. వెంకీతో అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ అనుదీప్ తెరకెక్కించబోతున్నారట. ఈ ఇటీవల F3తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేశ్.. సాలీడ్ హిట్ అందుకున్నారు.
ప్రస్తుతం ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆయన.. ఇంతవరకు కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దివాలీ’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుదీప్ తో వెంకీ మూవీ తెరకెక్కించనున్నట్లు వస్తున్న వార్తలపై వెంకీ అభిమానలు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం అనుదీప్ తమిళ స్టార్ శివకార్తీకేయన్ తో ప్రిన్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ అనంతరం వెంకటేష్ తో సినిమాను పట్టాలెక్కించున్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలె తెలియజేయండి.