సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఏ అప్డేట్ అయినా.. విశేషమైనా సోషల్ మీడియా వేదికగానే బయట పెడుతుంటారు. సెలబ్రిటీలు పోస్టులు పెట్టినా పెట్టకపోయినా అభిమానులు మాత్రం వారి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అయితే.. తెలుగు ప్రేక్షకులకు మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పెళ్లికి ముందు సినిమాలలో నటించిన నిహారిక.. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు బై చెప్పేసి పూర్తిగా తన టైమ్ ని ఫ్యామిలీకే కేటాయిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న నిహారిక.. ఇటీవల 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేసింది. అయితే.. సోషల్ మీడియాలో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకునే నిహారిక.. అప్పుడప్పుడు తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని పలకరిస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్నప్పటికీ, నిహారిక ఎప్పుడూ కూడా గ్లామర్ పరంగా హద్దులు దాటలేదు. అప్పుడప్పుడు తన భర్తతో ఉన్నటువంటి రొమాంటిక్ పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో నిహారిక తాజాగా ఓ కొత్త పోస్ట్ పెట్టి అందరిని సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి. తన భర్త చైతన్యతో కలిసి జిమ్ లో వర్కౌట్ చేస్తున్న టైంలో నిహారిక.. తన అద్దంలో చూస్తూ తీసుకున్న ఓ సెల్ఫీ అది. ఈ ఫొటోలో నిహారిక తన టాప్ పైకెత్తి చూపిస్తూ.. ఫోటోలకు పోజులివ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో నెట్టింట నిహారిక, చైతన్యల ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. మరిబి మెగా డాటర్ నిహారిక కొత్త పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by Tollywood Film Zone (@tollywooodfilmzone) View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews)