Rithu Chowdary: జబర్దస్త్ రీతూ చౌదరి.. నిజానికి ఈమె ముందు నుంచే సీరియల్స్ లో నటిస్తున్నా కూడా జబర్దస్త్ షోతోనే మంచి గుర్తింపు లభించింది. ఎంత గుర్తింపు అంటే.. కామెడీ షో పేరు ఇంటి పేరుగా మారిపోయింది. జబర్దస్త్ రీతూ అనేంతలా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం పొందేసింది. తన అందం, అమాయకత్వం, కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక, రీతరూ చౌదరి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా.. ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ ఉంటుంది.
ఇటీవలే ఆమె తన బాయ్‌ఫ్రెండ్ శ్రీకాంత్‌ను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే అతడితో పెళ్లి పీటలెక్కనున్నట్లుగా కూడా ఆమె పేర్కొంది. అతడితో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేసింది. తాజాగా, మరో సారి కాబోయే భర్త శ్రీకాంత్‌తో దిగిన ఫొటోను రీతూ చౌదరి షేర్ చేసింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను ఉంచింది. దానికి క్యాప్షన్‌గా.. ‘‘ నేను నిన్ను చూసి ప్రతీసారి మళ్లీ ప్రేమలో పడతాను’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మొదట స్టార్ మా మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన రీతూ.. ఆ తర్వాత మోడలింగ్ లో అడుగుపెట్టి, యాంకర్ ప్రదీప్ పెళ్లిచూపులు ప్రోగ్రాంలో పాల్గొంది. ఆ ప్రోగ్రాం తర్వాత గోరింటాకు సీరియల్ ద్వారా నటిగా తన జర్నీ మొదలుపెట్టింది. అక్కడినుండి సీరియల్ నటిగా వరుస అవకాశాలతో బిజీ అయిపోయి ‘మౌనమే ఇష్టం’ అనే మూవీలో నటించింది. తర్వాత పలు సీరియళ్లలో కీలక పాత్రలు చేసింది. మరి, కాబోయే భర్తతో జబర్థస్త్ రీతూ చౌదరి ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Kalyan Ram: సతీమణితో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కళ్యాణ్ రామ్..