తెలుగు ఇండస్ట్రీలో సరైన అవకాశం రావాలే కానీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో మంది ముద్దుగుమ్మలు రెడీగా ఉన్నారు. ఇప్పటి జెనరేషన్‌లో తెలుగమ్మాయిలకు మేకర్స్ ఆఫర్స్ ఇవ్వడం లేదు అనే వాదన బలంగా వినిపిస్తోంది.
తెలుగు ఇండస్ట్రీలో సరైన అవకాశం రావాలే కానీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో మంది ముద్దుగుమ్మలు రెడీగా ఉన్నారు. ఇప్పటి జెనరేషన్‌లో తెలుగమ్మాయిలకు మేకర్స్ ఆఫర్స్ ఇవ్వడం లేదు అనే వాదన బలంగా వినిపిస్తోంది. మాధవీ లత, శ్రీవిద్య, బిందు మాధవి, అంజలి, ప్రియాంక జవాల్కర్.. ఇలా చెప్పాలంటే ఠక్కున ఓ పది మంది హీరోయిన్ల పేర్లు కూడా గుర్తుకురావు. ఇటీవల తెలుగు మూలాలున్న శ్రీలీల మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా మారింది. ఇప్పుడు ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య వంతు వచ్చింది. ఇక స్మాల్ స్క్రీన్ మీద కూడా సిల్వర్ స్క్రీన్‌పై సత్తా చాటే గ్లామర్ అండ్ టాలెంటెడ్ భామలున్నారు.
అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీముఖి, విష్ణు ప్రియ, దీపిక పిల్లి వంటి కొందరు వెండితెర మీద కూడా మెరిశారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం, అభినయం ఉన్న భామల్లో యంగ్ బ్యూటీ రీతూ చౌదరి గురించి టీవీ ఆడియన్స్‌కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు పాపులర్ షోలలో కనిపించి ఆకట్టుకుంది. అమ్మడికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ అన్నిటినీ షేర్ చేస్తూ నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది. రీతూ పోస్ట్ చేసే పిక్స్, వీడియోలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు వదిలిందంటే సామాజిక మాధ్యమాలలో సెగల పొగలు రేగాల్సిందే.
గ్లామర్ డోస్ పెంచి రీతూ చేసే రీల్స్, ఫోటోషూట్స్ బాగా ఆకట్టుకుంటుంటాయి. అచ్చ తెలుగు అందం తెర మీద కనిపిస్తే చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ తమ కోరికను బయట పెడుతున్నారు. ఇతర భాషల నుండి దిగుమతయ్యే హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చే బ్యూటీ రీతూ చౌదరి. చక్కటి ఫిజిక్ మెయింటెన్ చేస్తుంటుంది. చూడగానే ఆకట్టుకునే రూపం తన సొంతం. మంచి పర్ఫార్మర్ కూడా. కానీ ఇన్ని క్వాలిటీస్ ఉన్నా బుల్లితెర మీద సరైన గుర్తింపు రాలేదు. తనను సరిగా గుర్తించడం లేదు అనేది అభిమానుల నిరాశ. ‘నీకు సినిమాలే కరెక్ట్. సాలిడ్ సినిమా పడితే బ్రేక్ వస్తుంది. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ రీతూకి ఆఫర్స్ ఇవ్వండి. యాక్ట్రెస్‌గా ఆమెకు మంచి ఫ్యూచర్ ఉంది’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.