సోషల్ మీడియా.. పుణ్యమా అని ఎంతో మంది ప్రతిభావంతులు మనకు పరిచయం అయ్యారు. మరీ ముఖ్యంగా టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపాయి. చాలా మంది ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకువచ్చాయి. మన దగ్గర ఇలా సో షల్ మీడియా ద్వారా గుర్తింపు.. పొంది ఆ తర్వాత రియాలిటీ షోలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొగ్రామ్స్‌లో అవకాశాలు పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో.. బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి ముందు వరసలో ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకుంది అషు రెడ్డి. అలా బిగ్‌బాస్ అవకాశం తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ ఓటీటీలో కూడా పాల్గొంది. అయితే వీటితో వచ్చిన గుర్తింపు కన్నా.. కూడా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూలు అషును మరింత ఫేమస్ చేశాయి.
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్ముడు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ మధ్యకాలంలో బోల్డ్ ఫోటో షూట్లతో.. రెచ్చిపోతుంది. ఇక కొన్ని రోజుల క్రితం వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఎంత సంచలంనగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇంటర్వ్యూపై విమర్శల సంగతి పక్కన పెడితే.. అషు రెడ్డికి విపరీతమైన గుర్తింపు దక్కింది. నేషనల్ మీడియాలో కూడా ఈ బోల్డ్ ఇంటర్వ్యూపై వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా అషు రెడ్డికి సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం పలు చానెల్స్‌లో వివిధ కార్యక్రమాల్లో కనిపిస్తు బుల్లితెరపై సందడి చేస్తున్న అషురెడ్డి.. త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుందట. హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. యంగ్ హీరో అరవింద్ కృష్ణ తాజాగా ఓ కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ఏ మాస్టర్ పీస్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. సిల్వర్ స్క్రీన్‌పై ఇదివరకెన్నడూ చూడని కొత్త తెలుగు సూపర్ హీరోగా అరవింద్ కృష్ణ.. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడట. సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అషు రెడ్డి హీరోయిన్‌గా సెలక్ట్ అయినట్లు సమాచారం. ఇది తెలిసి అషు ఫ్యాన్స్ సంబరపడుతుండగా.. ఇక సిల్వర్ స్క్రీన్ మీద ఇంకెంత రెచ్చిపోతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.