బ్రిటన్‌లో ఓ కారు దొంగతనం సీన్ సినిమాను తలపించే విధంగా ఉంది. యూకే రైల్వే స్టేషన్లో ఓ దొంగ ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారును దొంగిలించ డానికి పథకం వేశాడు. ఇది గుర్తించిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని తోసేసి కారును రైలు పట్టాలపై పరుగు పెట్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. కారు డ్రైవర్ పట్టాలపై కారు నడిపి ఆగివున్న రైలును ఢీకొట్టాడు.
అంతకు ముందు ఏకంగా పోలీసు వాహనాన్నే ఢీకొట్టాడు. హెర్ట్ ఫోర్ట్ షైర్లోని చెస్తాన్టెన్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆ కారు అతనిది కాదు. దాన్ని దొంగిలించాడు అని అధికారులు తెలిపారు. ఎస్సెక్స్‌లో చోరీ చేసిన కారును ఈ రైల్వే స్టేషన్ దగ్గరకు తెచ్చాడు. పోలీసులు అతన్ని పట్టుకున్నారు. కారు దిగమన్నా, అతను కారు దిగలేదు. నానా రచ్చ చేసి పోలీసుల కారును, ఇతర వాహనాల్ని ఢీకొట్టి రైల్వే స్టేషన్ వైపు పారిపోయాడు.
ఇద్దరు పోలీసలు గాయపడ్డారు. ఎలాగైనా పట్టుకోవాలని ఛేజింగ్ మొదలుపెట్టారు. పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయిన అతనికి కొంత దూరం వెళ్లాక రోడ్డు కనిపించలేదు. రైలు పట్టాలు వచ్చాయి. వెనక చూస్తే పోలీసులు తరుముకొస్తున్నారు. పారిపోయేందుకు పట్టాలపై నుంచే వెళ్లి పోదామని ట్రై చేశాడు. వేగంగా పట్టాలపై కారు నడిపాడు. ఓవైపు కారుకు పొగ వస్తున్నా అతను అలాగే ముందుకు వెళ్లాడు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులు , రైల్వే అధికారులు, రైల్వే పోలీసులకు కూడా ఇది షాకులా అనిపించింది.
పట్టాలపై పారిపోయిన అతను కాస్త దూరంలో ఆగివున్న ఖాళీ రైలును ఢీ కొట్టాడు. అప్పటికే అలర్ట్ అయిన అధికారులు, పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్టు చేశారు. కారును సీజ్ చేశారు. పట్టాలపై కారు రావడం కొత్తగా ఉందని నెటిజన్లు అంటున్నారు. అక్కడి సీసీ కెమెరాల్లో ఇది రికార్డైంది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ గ్రాండ్ తెఫ్ట్ ఆటో (జిటిఏ) గేమ్‌ను గుర్తు చేసిందని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ఈ సీన్ కంప్యూటర్ గేమ్‌లను తలదన్నేలా ఉందని రాసుకొచ్చాడు.
So this happened today… pic.twitter.com/CwnMZzBzsO
— A (@Cyp_Alii) July 15, 2021