ఇంట్లో చొరబడి దోచుకోవడమే కాకుండా.. ఏటీఎం మిషన్లను, రైళ్ల భోగీలను, చివరకు వంతెలను కూడా మాయం చేసేస్తున్నారు. అదీ చాలదన్నట్లు మొన్నటికి మొన్న బీహార్‌లో రెండు సెల్ టవర్లను కూడా చాక చక్యంగా దోచుకెళ్లారు. తాజాగా ఓ దొంగ.. వింత దాన్ని చోరీ చేశాడు.
దోచుకోవడానికి కాదేదీ అర్హం అని నిరూపిస్తున్నారు దొంగలు. ఇంట్లో చొరబడి దోచుకోవడమే కాకుండా.. ఏటీఎం మిషన్లను, రైళ్ల భోగీలను, చివరకు వంతెలను కూడా మాయం చేసేస్తున్నారు. అదీ చాలదన్నట్లు మొన్నటికి మొన్న బీహార్‌లో రెండు సెల్ టవర్లను కూడా చాక చక్యంగా దోచుకెళ్లారు. కొన్ని సార్లు దొంగతనాలు భయకంపితానికి గురి చేస్తుంటే.. కొన్ని సార్లు నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా మరో వింత దొంగతనం బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి పుట్టిన రోజు కావడంతో నగరమంతా హోర్డింగులు ఏర్పాటు చేయగా.. వాటిని కూడా చోరీ చేసి వార్తల్లో నిలిచాడో దొంగ. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో వింత దొంగతనం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పుట్టిన రోజు కోసం వేసిన హోర్డింగ్‌లు చోరీకి గురయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆరుగురు పోలీసులు రంగంలోకి దిగి.. గాలింపు చర్యలు చేపట్టి.. 24 గంటల్లో దొంగను పట్టకున్నారు. వివరాల్లోకి వెళితే. ఈ నెల 3న సీఎం గెహ్లాట్ పుట్టినరోజు కావడంతో జైపూర్‌లోని విశ్వకర్మ ప్రాంతంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ ఇనిస్టిట్యూట్‌లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. నగరమంతా హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు స్థానిక నేతలు, కార్యకర్తలు. దీంతో వీకేఐ రోడ్డు సమీపంలో ఓ హోర్డింగ్‌ను ఏర్పాటు చేయగా.. దాన్ని ఎత్తుకెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. దొంగతనం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ ఇనిస్టిట్యూట్ జిల్లా అధ్యక్షుడు సీతారాం సైనీ గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే ఎవరు తీశారన్న కోణంలో హోర్డింగ్ చోరీకి గురైన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. దాని ఆధారంగా దొంగతనానికి పాల్పడ్డ కపిల్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని విచారించగా చాలా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. దొంగ ఓ హోర్డింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే సదరు కంపెనీ వారు తనకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో హోర్డింగు దొంగతనం చేసినట్లు వెల్లడించాడు.