ఇంట్లో చొరబడి దోచుకోవడమే కాకుండా.. ఏటీఎం మిషన్లను, రైళ్ల భోగీలను, చివరకు వంతెలను కూడా మాయం చేసేస్తున్నారు. అదీ చాలదన్నట్లు మొన్నటికి మొన్న బీహార్లో రెండు సెల్ టవర్లను కూడా చాక చక్యంగా దోచుకెళ్లారు. తాజాగా ఓ దొంగ.. వింత దాన్ని చోరీ చేశాడు.
నేటి తరంలో మానవత్వ విలువలు కుంచిచుకుపోతున్నాయి. సొంతలాభం కొంత మానుకుని.. పొరుగువాడికి సాయపడవోయ్ అన్న గురజాడ వ్యాఖ్యలను పెడచెవిన పెట్టేస్తున్న ధోరణి కనబడుతోంది. ఆపద, అత్యవసర పరిస్థితిలో చేయందించే ఆపన్న హస్తం కరువౌతోంది. ఏం చేస్తే తమకు ఏం నష్టం జరుగుతుందోనని వెనకడుగు వేస్తున్నారు. తమ ముందు జరుగుతన్న అన్యాయాన్ని ఎదురించడం కాదూ కదా.. కనీసం స్పందించేందుకు కూడా ముందుకు రావడం లేదు. దీని వల్ల ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను కోల్పోయిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. […]
పెళ్లి అనేది జీవితంలో ఒకసారి వచ్చే పండుగ. దీని కోసం ఆర్భాటంగా ఖర్చు పెట్టి మరీ ఘనంగా జరుపుతారు. కొంతమంది పెళ్లి కోసం కష్టపడి డబ్బు పోగేసుకుంటారు, మరి కొంతమంది అప్పులు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన పెళ్లి ఖర్చుల కోసం కష్టపడడం ఎందుకని సులువుగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అందుకోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. నగలు, వెండి వంటి విలువైన వస్తువులు దొంగతనం చేశాడంటే పెళ్లి కోసం అనుకోవచ్చు. కానీ మరీ […]
సాధారణంగా దొంగ చేసే మొదటిపని ఏంటి? ఎవరికంటా పడకుండా, అందినకాడికి దోచుకొని అక్కడినుంచి పారిపోవడం. ఇదేగా! కానీ మన కథలో దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. నిద్ర ముంచుకు రాగానే అక్కడే పడుకుని నిద్రపోయాడు. గదిలో నుంచి గురక శబ్ధం రావడంతో మేల్కొన్న ఇంటి యజమాని.. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ ఆసక్తికర ఘటన జరిగింది మరెక్కడో కాదు.. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో. ఈ వార్త విన్న స్థానికులు […]
బ్రిటన్లో ఓ కారు దొంగతనం సీన్ సినిమాను తలపించే విధంగా ఉంది. యూకే రైల్వే స్టేషన్లో ఓ దొంగ ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారును దొంగిలించ డానికి పథకం వేశాడు. ఇది గుర్తించిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని తోసేసి కారును రైలు పట్టాలపై పరుగు పెట్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. కారు డ్రైవర్ పట్టాలపై కారు నడిపి ఆగివున్న రైలును ఢీకొట్టాడు. అంతకు ముందు ఏకంగా పోలీసు వాహనాన్నే […]