పెళ్లి అనేది జీవితంలో ఒకసారి వచ్చే పండుగ. దీని కోసం ఆర్భాటంగా ఖర్చు పెట్టి మరీ ఘనంగా జరుపుతారు. కొంతమంది పెళ్లి కోసం కష్టపడి డబ్బు పోగేసుకుంటారు, మరి కొంతమంది అప్పులు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన పెళ్లి ఖర్చుల కోసం కష్టపడడం ఎందుకని సులువుగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అందుకోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. నగలు, వెండి వంటి విలువైన వస్తువులు దొంగతనం చేశాడంటే పెళ్లి కోసం అనుకోవచ్చు. కానీ మరీ దారుణంగా ఆడవారి లోదుస్తులను దొంగతనం చేయడమే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టార్గెట్ చేసిన ఇంటి నుండి వెండి, బంగారంతో పాటు ఆడవారి లోదుస్తులను ఎత్తుకొచ్చేయడం ఈ కుర్రాడి వీక్ నెస్.
వివరాల్లోకి వెళ్తే.. సంజయ్ నిషాంక్ (33) అనే వ్యక్తి ఒడిశాలోని సరదాపూర్ ప్రాంతంలో ఖుర్దాలోని అత్రిలో నివాసం ఉంటున్నాడు. బీబీఏ చదివిన ఇతగాడు ఒడిశా పట్టణంలోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ వచ్చాడు. ఈ రొమాంటిక్ దొంగ 2018లో 60 లక్షల దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చాడు. అప్పట్లో తన గర్ల్ ఫ్రెండ్ కి బహుమతులు ఇవ్వడం కోసం దొంగతనాలు చేసేవాడు. ఇప్పుడు ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ ఏడాది డిసెంబర్ లో నిషాంక్ పెళ్లి ఉంది. దొంగతనం చేసిన సొత్తుని అమ్మగా వచ్చిన సొమ్ముతో పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అనుకున్నాడు.
ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ కంపెనీలో డెలివరీ ఏజెంట్ గా చేరాడు. ఫుడ్ డెలివరీ చేస్తూనే.. దొంగతనానికి అనుకూలంగా ఇళ్ళకి టార్గెట్ ఫిక్స్ చేసుకునేవాడు. తాళాలు ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. అలా ఇప్పటి వరకూ 22 లక్షల రూపాయలు విలువ చేసే 423 గ్రాముల బంగారం, 606 గ్రాముల వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు వంటివి దోచుకున్నాడు. ఇవి మాత్రమే కాకుండా ఆడవారి లోదుస్తులు కూడా దోచుకున్నాడు. ఇది వేరే ముచ్చట. గత రెండు, మూడు నెలలుగా నాయపల్లి, చంద్రశేఖర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద తిరుగుతూ.. మహిళల లోదుస్తులను దొంగతనం చేస్తున్న నిందితుడి మీద ఒడిశాలోని పలు చోట్ల నుంచి 5 ఫిర్యాదులు రావడంతో కొన్ని గుర్తుల ఆధారంగా ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన సొత్తుని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఆన్ లైన్ లో తన పెళ్ళి షాపింగ్ చేసుకున్నాడు. 2 ల్యాప్ టాప్ లు, 2 మొబైల్ ఫోన్లు, 230 బ్రాండెడ్ జీన్స్, 25 జతల షూస్ కొనుక్కున్నాడు. నిందితుడి నుంచి వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వీటితో పాటు దొంగతనం చేసిన ఆడవారి లోదుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలు ఎందుకు చేస్తున్నావ్ రా అని పోలీసులు విచారించగా.. తన పెళ్లి కోసమే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు నిషాంక్.
BBA Graduate Held For Series Of Thefts In #Odisha Capital; Lingeries Among Valuables Seized @cpbbsrctc @dcpbbsr #odishabytes #odishabytesnewshttps://t.co/oifPGYVrqX
— Odisha Bytes News (@BytesOdisha) October 26, 2022
తన పెళ్లిని భారీగా ప్లాం చేశానని, అందరిలా గ్రాండ్ గా చేసుకునేందుకు బడ్జెట్ లేక ఇలా ప్లాన్ చేశానని విచారణలో చెప్పుకొచ్చాడు. ‘బంగారం, వెండి వంటివి దొంగలించావంటే అర్ధం ఉంది కానీ ఆడవాళ్ళ లోదుస్తులు దొంగతనం చేయడం వెనుక ఉన్న నీ మోటివ్ ఏంట్రా’ అని పోలీసులు అడుగగా.. కప్ బోర్డులో వాటిని దాచుకుని అస్తమానూ వాటిని చూసుకుంటూ ఆనందం పొందుతానని చెప్పుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. అదన్నమాట విషయం. ప్రియురాలికి బహుమతులు ఇవ్వడానికి 2018లో దొంగగా మారాడు. మళ్ళీ ఇప్పుడు ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు ఇలా దొంగతనాలకు పాల్పడ్డాడు. కిక్ కోసం మహిళల లోదుస్తులని దొంగతనం చేస్తూ వచ్చాడు.