మహిళలకు అన్ని రంగాల్లోనూ ఇబ్బందులు తప్పటం లేదు. ఇంటి దగ్గర, పని చేసే చోట ఆఖరికి ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లినా వారిని హింసిస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూడా మహిళలకు అవమానాలు తప్పటం లేదు. తాజాగా, ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న కొంతమంది యువతులకు చేదు అనుభవం ఎదురైంది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు వారి బట్టలు విప్పించి మరీ చెకింగ్ చేశారు. మరియానా అనే 23 ఏళ్ల బాధిత యువతి ఓ స్పానిస్ న్యూస్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ఆమె మట్లాడుతూ.. ‘‘ నాది స్పెయిన్‌లోని మాడ్రిడ్. కువైట్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. ఓ రోజు నాకు ఇంటర్వ్యూకు రమ్మని కాల్ వచ్చింది.
నేను మాడ్రిడ్‌లోని ఓ హోటల్‌కు ఇంటర్వ్యూ కోసం వెళ్లాను. ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్లు తమది ప్రపంచంలోనే పెద్దదైన కాబిన్ క్రూ రిక్రూట్‌మెంట్ ఎజెన్సీ అని చెప్పారు. మొదటి నుంచి ఆ ఇంటర్వ్యూ ఇబ్బందిగా అనిపించింది. ఇంటర్వ్యూ మొదలైన కొద్ది సేపటి తర్వాత వాళ్లు మా దుస్తుల్ని విప్పించారు. అడిగితే.. గాట్లు, మచ్చలు చెక్ చేయటానికి అని చెప్పారు. బరువు కూడా బట్టలు లేకుండా తూయాలన్నారు. కొంతమందికి బరువు తగ్గించుకోమని సలహా ఇచ్చారు. కొంతమందికి బాగా తినమని అన్నారు. మరో దారుణ విషయం ఏంటంటే..
ఓ అమ్మాయి చర్మం, నవ్వు బాగాలేదని రిజెక్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ అయిన వారిని ఓ రూములోకి పిలిచి బట్టలు విప్పమన్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. రొమానియాకు చెందిన బియాంకా అనే 23 ఏళ్ల యువతి మాట్లాడుతూ.. ‘‘ మొదటి అమ్మాయి గదిలోకి వెళ్లి ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన చాలా మంది గదిలో బట్టలు విప్పమన్నారని చెప్పారు. నేను నమ్మలేదు. నేను లోపలికి వెళ్లిన తర్వాత అప్పుడు అర్థం అయింది. అక్కడ ఆడవాళ్లే పరీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ల ముందు అతి కష్టం మీద దుస్తులు విప్పాను’’ అని చెప్పుకొచ్చింది. మరి, ఎయిర్ హోస్టెస్ ఇంటర్వ్యూలో యువతులకు ఎదురైన ఈ దారుణమైన అనుభవాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.