హైదరాబాద్- తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. మొదటి ఏడాది ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను యధావిధిగా రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్‌కు మాత్రం పూర్తి మార్కులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు కూడా 35 శాతం మార్కులను ఇచ్చి పాస్ చేసేలా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఎవైనా సబ్జెక్టులు బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది.
ఇక ఇంటర్ పరీక్షల కోసం ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డ్ మార్గదర్శకాల్లో తెలిపింది. ఐతే ఇలా ఇచ్చే మార్కులు, ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు ఓ వెసులు బాటు కల్పించారు. కరోనా పరిస్థితులు కాస్త మెరుగయ్యాక పరీక్షలు రాయాలనుకుంటున్న విధ్యార్ధులకు ప్రత్యేకంగా ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఇందుకు సంబందించిన మార్గదర్శకాలను ఇంటర్ బోర్డు కార్యదర్శికి విద్యాశాఖ కార్యదర్శి జారీ చేశారు.
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా అందరికి ఒకేలా మార్కులు ఇవ్వడంపై చాలా మంది విధ్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు నిర్వహిస్తే తాము బాగా రాసి ణంచి మార్కులు తెచ్చుకునే వాళ్లమని అంటున్నారు. వీరందరి ఆవేధనను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ బోర్డ్ ఈ వెసులు బాటును కల్పించింది. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక పరీక్షలు రాయాలనుకుంటున్న వారికి ఎగ్జామ్,్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దీంతో విధ్యార్ధులు కొంత ఊరట చెందారు.