కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ చిన్నతనంలో చదువుకునేందుకు వీలు కాక ఆ కోరిక పెద్ద వయసులో తీర్చుకుంటారు. టెన్త్, ఇంటర్ పాస్ అయి ఉన్నత తమ చిన్ననాటి కోరిక తీర్చుకుంటారు.
సమాజంలో మంచి చదువు చదవి ఉన్నతమైన పొజీషన్లో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడైనా సరే తమ పిల్లలకు ఉన్నతవిద్య అందించేందుకు కృషి చేస్తుంటారు. అయితే కొంతమంది చదవాలని ఉన్నా.. అనివార్య కారణాల వల్ల చదువు మద్యలోనే ఆపేసి ఇతర పనుల్లో బిజీ అవుతారు. మద్య వయసు వచ్చిన తర్వాత చదువుకోవాలనే ఆకాంక్షతో మళ్లీ టెన్త్, ఇంటర్ పరీక్షలు రాస్తుంటారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో గత నెలలో జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. బరేలీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్ర సైతం సబ్జెక్ట్‌ల్లో పాస్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ లో గత నెలలో జరిగిన ఇంటర్ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు పాస్ కావడంతో వారి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంలో మునిగిపోయారు. అయితే ఈ ఎగ్జామ్స్ లో మరో ప్రత్యేకత ఏంటంటే.. బరేలీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా అలియాస్ పప్పు భరతోల్ ఇంటర్ లో అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ అయ్యారు. తన కార్యకర్తలతో పాటు పలువురు విద్యార్థులకు స్వీట్లు పంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మూడు సబ్జెక్టుల్లో అనుకున్న మార్క్స్ రాలేదని.. దానికోసం రీకౌంటింగ్ కి దరఖాస్తు చేసుకుంటానని తెలిపారు. తాను లాయర్ అయి పేద ప్రజలకు సహాయంగా ఉండటమే లక్ష్యం అని తెలిపారు. ప్రజల సమస్యలు వింటూ తన చదువుకు కొంత సమయాన్ని కేటాయించి కష్టపడి పాస్ అయ్యానని అన్నారు. ఇంటర్ పాసైన రాజేశ్ మిశ్రాని సీఎం యెగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు.
ఇక మీరఠ్ జిల్లాలోని హస్తినపూర్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి, మంత్రిగా సేవలు అందించిన ప్రభుదయాల్ వాల్మీకి.. తన 59 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాసి సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారు. ఈసందర్భంగా ప్రభుదయాల్ మాట్లాడుతూ.. తనకు చదువు కోవాలని ఎంతో ఇష్టం ఉన్నా చిన్నతనంలో కొన్ని ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోయానని.. మనసులో బలమైన కోరిక ఉంటే ఎంతటి లక్ష్యం అయినా సాధించవొచ్చని అన్నారు. ప్రతి ఒక్కరికీ చదువు ఎంతో ముఖ్యం అని.. చదువు విలు తెలుసు కనుకనే పేద ప్రజల చదువు కోసం పోరాడుతానని అన్నారు.