యువ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటీ తెరకెక్కించిన చిత్రం కార్తికేయ-2. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచే కార్తికేయ-2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక బాలీవుడ్ లో అయితే ఓ రేంజ్ లో దుమ్ములేపింది. ఎంతలా అంటే అక్కడి సినిమాలను సైతం వెనక్కి నెట్టి వసూల్లలో కార్తికేయ2 దూసుకెళ్లింది. ఈ అఖండ విజయంతో కార్తికేయ-2 మూవీ టీమ్ సంబంరాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో పలు ఇంటర్యూల్లో పాల్గొన్ని తమ అనుభవాలను పంచుకున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో తాజాగా నిఖిల్ ఓ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ” సినీ పరిశ్రమలో నాకంటూ ఓ గాడ్ ఫాదర్ ఉండుంటే ఇబ్బందులు పడేవాడిని కాదు” అని నిఖిల్ తెలిపాడు. ఓ ఆంగ్ల పత్రికతో హీరో నిఖిల్ సరదగా ముచ్చటించాడు.
కార్తికేయ-2 సినిమా కు ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదలు తెలిపాడు. ఓ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోవాలంటే కథే మూలమని.. అది బాగుంటే తప్పకుండా విజయం లభిస్తుందన్నాడు. ఇంకా హీరో నిఖిల్ మాట్లాడుతూ..”ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని ఓ కుటుంబం నుంచి వచ్చి.. నటుడిగా మారడమే నాకో పెద్ద విజయం. ఈ రోజు ప్రేక్షకుల నుంచి వస్తున్న అభిమానాన్ని, ప్రేమను చూస్తుంటే నా మొదటి సినిమా ‘హ్యాపీ డేస్’ రోజులు గుర్తుకు వస్తున్నాయి. సినీ పరిశ్రమ అంటేనే రోలర్ కోస్టర్ రైడ్ లాంటింది. ప్రతి ఒక్కరూ ఇందులోకి రావాలని ఎంతో ఆశ పడుతుంటారు. ఏదో ఓ రకంగా విజయాలను, అపజయాలను చవి చూస్తుంటారు. అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూనే ఉంటుంది.
ప్రతి మనిషి ఓ మంచి రోజు అనేది తప్పక వస్తుంది. నాకు ‘హ్యాపీడేస్’ మూవీ తర్వాత వెనువెంటనే 6 సినిమాలు చేశాను. అయితే సినిమా, కథల ఎంపిక విషయంలో సలహాలు సూచనలు చేయడానికి నాకు మార్గదర్శకులెవరూ లేరు. అందుకే వరుస పరాజయాలను చవిచూశాను. సుమారు ఆరేళ్ల తర్వాత స్వామి రారా తో మళ్లీ విజయం అందుకున్నా. ఆ మూవీ విజయంతో నాకు అర్ధమైంది.. కథే అన్నింటికంటే ముఖ్యమని. ఒక వేళ ఈ పరిశ్రమలో నాకూ ఓ గాడ్ ఫాదర్ ఉండుంటే.. కెరీర్ ఆరంభంలో అన్ని కష్టాలు ఉండేవి కాదు” అని హీరో నిఖిల్ చెప్పుకొచ్చారు. మరి.. హీరో నిఖిల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.