ఫిల్మ్ డెస్క్- నవీన్ చంద్ర తెలుసు కదా. అదేనండీ అందాల రాక్షసీ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు కదా. ఆ సినిమా యావరేజ్ గా ఆడినా నవీన్ చంద్ర నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత నవీన్ చంద్ర హీరోగానే కాకుండా, ఇతర పాత్రల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేతలో నెగెటివ్ క్యారెక్టర్ లో నవీన్ చంద్ర యాక్షన్ కు మంచి పేరు వచ్చింది. ఇటీవలె పరంపర వెబ్ సిరీస్‌తో అలరించిన నవీన్ చంద్ర ప్రస్తుతం అరవింద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే నవీన్ చంద్ర ఇంత వరకు తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా చెప్పలేదు కదా.
ఇదిగో ఇప్పుడు ఒక్కసారిగా అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడు నవీన్ చంద్ర. తన ఫ్యామిలీ గురించి కాదు, ఏకంగా తన భార్య గురించే చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా తన భార్యను పరిచయం చేసి అందరికి షాకిచ్చాడు ఈ హీరో.
ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది.. హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ.. నా బెటర్ హాఫ్ ఓర్మా.. అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో ఫోటోను పోస్ట్ చేశాడు నవీన్ చంద్ర. ఇంకేముంది ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హీరో నవీన్ చంద్రకు అసలు పెళ్లి ఎప్పుడు అయ్యింది.. అంటూ ఆలోచనల్లో పడ్డ అభిమానులు. ఏదైతేనెం అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.