స్పెషల్ డెస్క్- ఈ ప్రపంచంలో ప్రేమ అన్నింటికంటే గొప్పదని చెబుతుంటారు. ఎందుకంటే ప్రేమతో దేన్నైనా సాధించవచ్చని, ఎవరినైనా మెప్పించవచ్చని, ఎంత మంది మనసునైనా గెలవవచ్చని అంటారు. అందుకే ప్రేమకు అంత శక్తి ఉందని, ప్రేమ ఒక్కసారి పెనవేసుకుంటే అది ప్రాణం పోయినా విడిపోదని కవులు కూడా కవితలు, పాటల్లో అందంగా వివరిస్తారు. నిజంగానే ప్రేమకు అంత శక్తి, బలం ఉన్నాయని నిరూపించిందో మహిళ.
చూడడానికి చాలా అసహ్యంగా, భయంకరమైన రూపంతో ఉన్న భర్తతో కాపురం చేస్తూ, ఆయనను ప్రేమగా చూసుకుంటూ బంధానికి మించింది ఏమి లేదని అంటుందో ఇల్లాలు. ప్రపంచ వ్యాప్తంగా బబుల్ మ్యాన్ గా గుర్తింపు పొందిన మహమ్మద్ ఉమర్ కు అరుదైన చర్మ వ్యాధి ఉంది. ఉమర్ ని 28 ఏళ్ళ వయస్సులో పరహాట్ అనే మహిళ ప్రేమించింది. ఆమె ప్రేమించే సమయానికే ఉమర్ కి ఈ చర్మ వ్యాధి మెల్లగా మొదలైంది. దీంతో పరిహాట్ ని ఆమె కుటుంబ సభ్యులు హెచ్చరించారు.
రానున్న రోజుల్లో ఆ వ్యాధి అతని శరీరం మొత్తం పాకుతుందని, అతడిని పెళ్ళి చేసుకుని చాలా ఇబ్బందులు పడతావని ఆమెకు నచ్చచెప్పారు. కానీ పరహాట్ మాత్రం అడుగు వెనక్కి వేయలేదు. ఉమర్ ను వివాహం పెళ్లిచేసుకుని ఆతనిపై తన ప్రేమను చాటుకుంది. అందరు చెప్పినట్టే పెళ్ళి తరువాత ఉమర్ కు చర్మ వ్యాధి మరింత ముదిరింది. ఒంటి నిండుగా బాబుల్స్ వచ్చాయి. దీంతో ఉమర్ చూడటానికి భయంకరంగా మారిపోయాడు.
కానీ పరహట్ మాత్రం ఎంతో ప్రేమగా అతన్ని చూసుకుంటా, అతనితో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ప్రస్తుతం మహమ్మద్ ఉమర్ కు 62 సంవత్సరాలు. ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇద్దరు కొడుకులకి మాత్రం అతని చర్మ వ్యాధి రాలేదు. ఈ కాలంలో చిన్న చిన్న కారణాలకే విడిపోతున్న జంటలు పరహాట్ ప్రేమ గొప్పతనం చూసైనా మారిలో మార్పు రావాలని కోరుకుందాం.