ఏ ముహూర్తాన కరోనా పుట్టుకొచ్చిందో తెలియదు గాని.., ప్రజలకి ప్రశాంతత లేకుండా చేస్తోంది. ఈ మహమ్మారి పుణ్యమా అంటూ.., ఇప్పటికే మాస్క్, శానిటైజర్స్, సోషల్ డిస్టెన్స్ వంటివన్నీ ప్రజలకి అలవాటు అయిపోయాయి. కానీ.., ఇంత కష్టంలోనూ కొంత మంది తమ హోదా చూపించుకోవాలని తాపత్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన మనోజ్ సెంగార్ అనే వ్యక్తి ఏకంగా గోల్డెన్ మాస్క్ తాయారు చేయించుకున్నాడు. ప్రస్తుతం ఈ బంగారం మాస్క్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మనోజ్ సెంగార్ కి ముందు నుండి బంగారం అంటే చాలా ఇష్టం. ఈ మక్కువ కారణంగానే ఆయనకి గోల్డెన్ బాబాగా పేరుంది. అయితే.., బంగారు మాస్క్ ఎందుకు తయారు చేపించుకోవాల్సి వచ్చిందో మనోజ్ సెంగార్ వివరించారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టించింది. ఇప్పటికీ దాని ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేపించుకోవడం, మాస్క్ వాడటం చాలా అవసరం. ప్రజలకి ఈ విషయంలో అవగాహన తీసుకుని రావాలనే గోల్డెన్ మాస్క్ సిద్ధం చేపించుకున్నట్టు గోల్డెన్ బాబా తెలియచేశాడు. మొత్తం 3 లేయర్స్ గల ఈ మాస్క్ ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల రూ.5 లక్ష. మరి.., ఇన్ని లక్షలు పోసి బంగారు మాస్క్ చేపించుకోవడంపై మీ అభిప్రాయాలను తెలియచేయండి.