ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ స్టేషన్ నుంచి బయలుదేరిన గూడ్స్ రైలు 2 కిలో మీటర్లు వెళ్లిన తర్వాత ప్రమాదానికి గురైంది. చిన్న వంతెన వద్ద ఇంజన్ పట్టాలు తప్పింది. దీంతో రైలు బోగీలు ఒక దానిపై ఒకటి ఎక్కెశాయి. అట్టాపెట్టెల్లా అత్కుకుని కూప్పగా పేరుకున్నాయి. ఈ రైలు ఫిరోజ్ నగర్ నుంచి ఖుర్దాకు ధాన్యం లోడ్‌తో వెళ్తుంది. ప్రమాద దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. గూడ్స్ రైలు కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ స్థాయిలో ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురైతే ఊహించని విధంగా ప్రాణనష్టం జరిగి ఉండేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. నిజానికి ఆ దృశ్యాలు చేస్తూ నిజంగానే వామ్మో అనిపిస్తుంది.
A freight train from Firoz Nagar to Khurda Road left Angul Station in Odisha derailed between Angul and Talcher Road (2km from Talcher Road). 9 Wagons of the train have been capsized and one wagon derailed at about 2.35 am. No casualty was reported: East Coast Railway pic.twitter.com/4R8i5W1vvK
— ANI (@ANI) September 14, 2021