ఈ మధ్య కాలంలో తరచుగా ఎక్కడో ఓ చోట అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. జన సమూహం ఎక్కువగా ఉండే చోట ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే.. దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి.
ప్రమాదం కారణంగా నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంభంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.