ఫిల్మ్ డెస్క్- బుల్లితెర యాంకర్, నటి హరితేజకు ఈ మధ్యనే పాప పుట్టిందని అందరికి తెలిసిందే. తనకు కరోనా సోకిన సమయంలో పాప పుట్టడం, తాను ఆనుభవించిన ఆవేధన, ఆందోళనపై ఇప్పటికే హరితేజ అభిమానులతో తన అనుభవాలను పంచుకుంది. హరితేజ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ తనకు సంబందించిన విషయాలను షేర్ చేస్తుంది. అన్నట్టు బిగ్ బాస్ షో తరువాత హరితేజ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు సీరియల్స్ లో విలనిజం ప్రదర్శిస్తూ అందరినీ బయటపెట్టే హరితేజ, బిగ్ బాస్ షో నుంచి అందరినీ నవ్విస్తూనే వస్తోంది.
ఓ వైపు బుల్లితెర, వెండితెరపై నటిస్తూనే సోషల్ మీడియాలో సైతం అభిమానులను అలరిస్తోంది హరితేజ. పాప పుట్టిన తరువాత హరితేజ కాస్త బిజీగా మారిపోయింది. కొన్నాళ్లు తన కెరీర్ కు కూడా విరామం ఇచ్చింది. ఇప్పుడు తన ప్రపంచమైంతా తన ముద్దుల పాపే అంటూ అమ్మ తనాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ మధ్యే హరితేజ తన పాపకు అద్భుతమైన పేరు పెట్టేసింది. భూమి దీపక్ రావు అంటూ నామకరణం చేసినట్టుగా పోస్ట్ చేసింది హరితేజ. దీంతో హరితేజ పాప పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత వరకు హరితేజ తన పాప మొహాన్ని క్లియర్‌గా చూపించలేదు. ఎప్పుడు చూపిస్తావ్ అక్కా అంటూ అభిమానులు ఆమెను అడుగుతున్నారు.
సోషల్ మీడియా ద్వార లైవ్ లోకి వచ్చిన హరితేజను అభిమానులు పాప మొహం చూపించాలని అడిగారు. త్వరలోనే చూపిస్తాను అంటూ హరితేజ సమాధానం చెప్పుకొచ్చింది. డెలివరి తరువాత హరితేజ మళ్లీ తన మునుపటి రూపాన్ని తెచ్చుకునేందుకు వర్కవుట్లతో తెగ బిజీగా ఉందట. ఈ క్రమంలో ఓ నెటిజన్ వర్కవుట్లతో పాలు పట్టించడానికి ఏమైనా ఇబ్బందిగా అనిపించడం లేదా అని అడిగాడు. అలాంటిదేమీ లేదని హరితేజ సింపుల్ గా చెప్పింది.