స్పెషల్ డెస్క్- ఫిల్మ్ స్టార్స్ కేవలం సినిమాల్లో మాత్రమే కాదు, వ్యాపార ప్రకటనల్లో నటించి కూడా బాగా సంపాదిస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వార సైతం నటీ నటులు బాగానే వెనకేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో సినిమా స్టార్స్ పెట్టే ఒక్కో పోస్ట్ వాళ్లకు కోట్ల రూపాయలను తెచ్చిపెడుతోంది. ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ ల ద్వార ఎక్కువగా సంపాదిస్తోంది గ్రోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.
ప్రియాంక చోప్రా ఫోర్బ్స్ జాబితాలో రిచ్చెస్ట్ ఇన్స్‌స్టాగ్రామర్ గా చోటు దక్కించుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో ప్రియాంక కు ఉన్న 6 కోట్ల 80 లక్షల మంది ఫాలోవర్స్ వల్లే ఆమెకు ఈ స్థానం దక్కింది. ఆమెకు కార్పొరేట్ కంపెనీలు ఒక్కో పోస్టుకి 1.80 కోట్ల రూపాయలు ఇస్తున్నాయట. ఇక సోషల్ మీడియా పోస్టుల ద్వార చాలా మంది కోట్ల సంపాదిస్తున్నారు.
బాలీవుడ్ మరో భామ ఆలియా భట్ కు సోషల్ మీడియా పోస్ట్ కు కంపెనీలు సుమారు కోటి రూపాయలు చెల్లిస్తున్నాయట. బాలీవుడ్‌లో నంబర్ వన్‌గా దూసుకుపోతోన్న మిస్ ఆలియాకు ఇన్‌స్టాగ్రామ్ లో 5 కోట్ల 50 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇక షారుఖ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ తక్కువనే చెప్పాలి. షారుఖ్ కు 2 కోట్ల 60 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. షారుఖ్ ఖాన్ ఒక్కో పోస్టుకి సుమారు కోటి రూపాయలు వసూలు చేస్తుంటాడు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2కోట్ల 80 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఐతే అమితాబ్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కు 50 లక్షల వరకు చెల్లిస్తున్నాయట కంపెనీలు. ఇక బాలీవుడ్, క్రికెట్ రంగాల్లో పవర్ కపుల్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ. వీళ్లిద్దరు కూడా ఇన్ స్టాగ్రామ్‌లో ఇన్‌స్టాంట్‌గా సంపాదిస్తున్నారు. అనుష్క ఒక్కో పోస్టుకి 95 లక్షలకు పైగా వసూలు చేస్తుండగా, ఆమె ఫాలోయర్ల సంఖ్య 52 మిలియన్లు ఉన్నారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో 15 కోట్ల 70 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కోహ్లీ ఒక్కో ఇన్ స్టా పోస్ట్ కు 1.35 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఇక రణవీర్, దీపికా పదుకొణే కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వార బాగానే సంపాదిస్తున్నారు. రణవీర్ 36 మిలియన్ల మంది ఫాలోయర్స్‌తో సుమారు 82 లక్షలు సంపాదిస్తోంటే, దీపికా 60 మిలియన్ ఫాలోవర్స్ తో సుమారు కోటిన్నర రూపాయలు ఆర్జిస్తోంది.