పోలీసుల కళ్లు గప్పి మత్తు పదార్థాలను రవాణా చేసేందుకు స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలు కనిపెడుతున్నారు. వాటిని చూసి నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు సైతం షాక్ అవుతున్నారు. తాజాగా బెంగుళూరులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎన్సీబీ అధికారులు పక్కా సమాచారంతో కోట్ల విలువైన సుమారు 3 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు పంపాల్సిన సరుకును ఆడవాళ్లు ధరించే లెహంగాల్లో దాచి ఉంచారని , ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
బెంగళూరు జోనల్ డైరెక్టర్ అమిత్ గావఠే టీమ్ అక్టోబర్ 21న అనుమానస్పదంగా ఉన్న పార్శిల్స్ చెక్ చేయగా డ్రగ్స్ దొరికినట్లు వివరించారు. అయితే ఆ పార్శిల్‌పై ఫ్రమ్ అడ్రస్ ఏపీలోని నర్సాపురం అని ఉంది. అయితే పార్శిల్ వచ్చింది మాత్రం చెన్నై నుంచి అని అధికారులు విచారణలో గుర్తించారు. ఈ వివరాలను చెన్నైలోని ఎన్‌సీబీ బృందానికి పంపించారు. వారు రెండు రోజుల పాటు దర్యాప్తు చేసి, పార్శిల్ పంపిన వ్యక్తి అసలు వివరాలు గుర్తించి శుక్రవారం పట్టుకున్నారు. పార్సిల్ పంపడానికి నకిలీ చిరునామాలు, ఫేక్ డాక్యుమెంట్లు వినియోగించినట్లు తెలిపారు.
NCB @narcoticsbureau in action #efforts4aDrugFreeIndia 🙏🏻🇮🇳🙏🏻
Hidden In Lehengas, Drugs Worth Crores Seized In Bengaluru – NDTV https://t.co/X1w2YAAgxj
— Director General NCB (@dg_ncb) October 23, 2021