వేరో భాషల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి విడుదల చేయడం సినీ పరిశ్రమలో పరిపాటి. అలా ఇటీవల తెలుగులోకి రీమేక్ అయిన సినిమా ‘బ్రో’. దర్శకుడు సముద్ర ఖని నటించి, తెరకెక్కించిన తమిళ చిత్రం వినోదయ సీతంకు రీమేక్.
వేరో భాషల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి విడుదల చేయడం సినీ పరిశ్రమలో పరిపాటి. అలా ఇటీవల తెలుగులోకి రీమేక్ అయిన సినిమా ‘బ్రో’. దర్శకుడు సముద్ర ఖని నటించి, తెరకెక్కించిన తమిళ చిత్రం వినోదయ సీతంకు రీమేక్. తమిళనాడులో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు కథలో మార్పులు చేశాడు దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మామ-అల్లుడు పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో కూడా సముద్రఖని దర్శకత్వం వహించాడు. ఈ నెల 28న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. టైంపై ఆధారపడి రూపొందించిన ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు మెగా అభిమానులు.
అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి తేజ్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. అదేంటంటే బ్రో సినిమా సెట్స్‌కు తాను తాగి వెళ్లానని మేనమామ పవన్ కళ్యాణ్ అనుమానించారట. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఆ సీన్ అలా పండటమే. యూనిట్ సభ్యులకు రాని అనుమానం.. తన మామకు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బ్రో సినిమాలో మామకు కేక్ తినిపించే సీన్ దగ్గర చాలా తడబడ్డానని, చేయి వణికిపోయిందని చెప్పిన ఆయన.. మరో సీన్లో కూడా ఇబ్బంది పడినట్లు చెప్పాడు. ఓ డ్రింక్ సీన్లో మామ పవన్ ముందు తాగుతూ నటించే సన్నివేశం అంది. ఓ సీన్లో ఆయన ముందు తాగుతూ నటించాలి. ఆయన ముందు అటువంటి సీన్లలో నటించేందుకు ఇబ్బంది పడినా.. ఆ సీన్ ఫర్ ఫెక్ట్‌గా వచ్చిందన్నారు.
ఆ సీన్ పూర్తయ్యాక తన దగ్గరకు పవన్ కళ్యాణ్ వచ్చి.. సెట్స్‌కి తాగి వచ్చావా అని అడిగారన్నారు. లేదు అని చెప్పేసరికి. ఈ సీన్లలో బాగా నటించావంటూ కితాబు నిచ్చారని సాయి తేజ్ తెలిపారు. తాగుడు మీద మంచి పట్టు ఉన్నట్టుందంటూ ఆట పట్టించారని, ఆ సీన్ తనకు బాగా నచ్చిందన్నారు. తనను ఆటపట్టిస్తుంటే.. తమకు తెలియకుండానే దర్శకుడు సముద్ర ఖని ఈ సీన్ షూట్ చేశారని చెప్పారు. అటువంటి సందర్భాలు రెండు మూడు జరిగాయన్నారు. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంటుందని అన్నారు. దేవుడి పాత్ర పోషించిన కళ్యాణ్ బీడి పట్టుకోవడం ఏంటీ, లుంగీ కట్టుకోవడం ఏంటీ లాంటి లాజిక్స్ చూడకుండా సినిమాను తిలకించాలని కోరారు. తనకు పవన్ గురువుతో సమానమని, ఆయనతో ముందు నటించేందుకు రెండు రోజుల టైమ్ పట్టిందన్నారు.