ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. బ్రేకింగ్ న్యూస్ కూడా మీమ్స్ రూపంలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడున్న యువతరం మొత్తం మీమ్స్ ద్వారానే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ఇక నేటి ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకొని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు యువతరానికి ట్రాఫిక్ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
Good Morning Cyberabad..#RoadSafety #RoadSafetyCyberabad #FridayMotivation pic.twitter.com/9ekq3Qp05y
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) December 17, 2021
తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న పుష్ప సినిమా ట్రైలర్ లోని ‘పార్టీ లేదా పుష్ప?’ అనే పాపులర్ డైలాగ్ తో బరిలోకి దిగారనే చెప్పాలి. అటు హెల్మెట్ – సైడ్ మిర్రర్స్ లేని బైక్ పై అల్లు అర్జున్ ఉన్న ఫోటోతో.. ఇటు ఫహద్ ఫాజిల్ ‘పార్టీ లేదా పుష్ప?’ సీన్ పిక్ అటాచ్ చేసి.. “హెల్మెట్ – మిర్రర్స్ లేవా.. పుష్ప?” అంటూ మీమ్ పోస్ట్ చేసింది సైబరాబాద్ పోలీస్ టీమ్. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ – రేర్ వ్యూ మిర్రర్స్ తప్పనిసరి అని ట్రాఫిక్ పోలీసులు చెప్పకనే చెబుతున్నారు. ప్రస్తుతం ‘హెల్మెట్ – మిర్రర్స్ లేవా.. పుష్ప?’ మీమ్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ పోస్ట్ పై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Wear Helmet & Fix Rearview Mirrors. Be Safe.#RoadSafety #RoadSafetyCyberabad #Pushpa #PushpaRaj pic.twitter.com/USlupBLHIR
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) December 17, 2021