మనకు మంచి చెప్పడంలో ఎప్పుడూ ముందుంటారు ట్రాఫిక్ పోలీసులు. ప్రయాణాలు చేసేప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటూ.. మన ప్రాణాల కోసం పరితపిస్తుంటారు. అయితే వారు చెప్పిన మాటలు మనం ఎందుకు వింటాం, అబ్బే.. వింటే ఇన్ని కోట్ల చలానాల డబ్బు ఎందుకు వసూల్ అవుతోంది.
నేటి సమాజంలో మంచి చెప్పడం అనేది ఓ బూతుగా.. నేరంగా భావిస్తున్నారు కొంత మంది ప్రజలు. మన మంచికి ఇతరులు ఎన్నో సలహాలు ఇస్తుంటారు. కానీ వారి మాటలను చెవిన పెట్టరు కొందరు ఆకతాయిలు. ఇక మనకు మంచి చెప్పడంలో ఎప్పుడూ ముందుంటారు ట్రాఫిక్ పోలీసులు. ప్రయాణాలు చేసేప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటూ.. మన ప్రాణాల కోసం పరితపిస్తుంటారు. అయితే వారు చెప్పిన మాటలు మనం ఎందుకు వింటాం, అబ్బే.. వింటే ఇన్ని కోట్ల చలానాల డబ్బు ఎందుకు వసూల్ అవుతోంది. అదీకాక ఈ మధ్య ఓ ఫ్యాషన్ వైరల్ గా మారింది. అదేంటంటే? బైక్ నంబర్ ప్లేట్ కనిపించకుండా, అసలు లేకుండా కొందరు ఆకతాయిలు రోడ్లపై విచ్చల విడిగా తిరుగుతున్నారు. అలాంటి వారికి సైబరాబాద్ పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు.
నగరంలో ఓ రద్దీ ప్రాంతంలో బైక్ పై ముగ్గురిని ఎక్కించుకుని వెళ్తున్నాడో యువకుడు. ఇది గమనించిన అక్కడి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ బండి ఫోటోను క్లిక్ మనిపించాడు. కానీ తీరా చూస్తే.. ఆ బండికి నెంబర్ ప్లేట్ లేదు. ఇలాంటి సంఘటలను నగరంలో కోకొల్లలుగా రోజూ మనం చూస్తూనే ఉంటాం. ఇక నంబర్ ప్లేట్ ఉన్న బైకర్స్ ది మరో ప్లాన్. నిబంధనలకు విరుద్దంగా వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ క్లిక్ మనిపించి చలానాలు విధిస్తారో అని.. సదరు నెంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్క్ లు పెడుతున్నారు, మహిళలు అయితే చున్నీలు అడ్డుపెడుతున్నారు. అయితే చాలన్లు తప్పించుకోవడానికి బైకులకు నంబర్ ప్లేట్స్ తొలగించడం, మాస్క్ లు తగిలించడం, రేడియం స్టిక్కర్లు అతికించడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దం అని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే పై విధంగా చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక కొంత మంది ఏకంగా నంబర్ ప్లేట్స్ పై సినిమా హీరోలు, క్రికెటర్ల బొమ్మలు వేసుకుని తిరుగుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా హెల్మెట్ లేకుండా, నంబర్ ప్లేట్ కనిపించకుండా తిరుగుతూ పట్టుబడితే.. కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఆకతాయిల వల్ల కొన్ని సార్లు అభం శుభం తెలియని అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. దాంతో ట్రాఫిక్ పోలీసులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టిని పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తు బైక్స్ నడిపేవారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.