హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకున్నారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సీఎం కాసేపటి క్రితం ప్రగతి భవన్ వచ్చారు. ఏప్రిల్ 18న కేసీఆర్ కు కరోనా పాజిటివ్ హా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి గజ్వేల్ ఎర్రవల్లి లోని తన ఫాంహౌజ్ లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. మే 21న హైదరాబాద్ సోమాజీ గూడ లోని యశోధా ఆస్పత్రిలో కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇక ఈ నెల 28 న ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో ముఖ్యమంత్రికి వైద్యులు కరోనా యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా అందులో నెగెటివ్ అని వచ్చింది.
ఐతే ఆర్టీపీసీఆర్ పరీక్షలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దీంతో మే 4న మరోసారి సీఎం కేసీఆర్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అదే రోజు కరోనా నుంచి ముఖ్యమంత్రి పూర్తిగా కోలుకున్నారని వ్యక్తిగత వైద్యులు ధ్రువీకరించారు. దీంతో సుమారు రెండు వారాల తర్వాత సీఎం ప్రగతి భవన్‌కు వచ్చారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో పాటు, పలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.