స్పెషల్ డెస్క్- వివాహం అంటేనే రెండు మనసులు కలవడం. రెండు కుటుంహాల సమ్మేళనం. వేర్వేరు సంప్రదాయాల కలయిక పెళ్లి. వివాహ బంధం వందేళ్ల పాటు నిలబడాలంటే భార్యా భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. పెళ్లి తరువాత దంపతుల మధ్య మనస్పర్ధలు, చిన్న గొడవలు సహజం. సాధారణంగా పెళ్లి వేడుకలు ఆనందంగా జరగాలన్నా.. వధూవరుల మధ్య సఖ్యత ఉండాలన్నా.. ఒకరినొకరు గౌరవించుకోవడం ఎంతో అవసరం. ఎవరిని ఎవరు గౌరవించకపోయినా ఆ బంధం సంతోషంగా ముందుకు సాగదు.
ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేకపోతే ఆ వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగదు. ఎన్ని కారణాలున్నా ఒకరిపై మరొకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం అనేది అన్ని సమస్యలకు కారణం అవుతుంది. ఇక పెళ్లి తరువాత సంగతి దేవుడెరుగు.. ఓ వరుడు ఏకంగా పెళ్లి పందిరిలోనే వధువుని అవమానించాడు. ఇలా తాళి కట్టాడో లేదో అలా అప్పుడే తన ప్రతాపం చూపడం మొదలు పెట్టేశాడు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కాని, ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
పెళ్లి మంటపంలో వధూవరులు వివాహ వేడుకలో భాగంగా వరమాల కార్యక్రమం కోసం ఎదురెదురుగా నిలబడ్డారు. ఇద్దరూ ఒకరి మెడలో మరొకరు ఆ పూల మాలలు వేయాలి. అయితే ఏంజరిగిందో తెలియదు కాని, పెళ్లి కొడుకు దండను ఏమాత్రం ఆసక్తి లేనట్లుగా వధువు మెడపైకి విసిరి పడేశాడు. దీంతో ఆ దండ ఆమె కాళ్ల దగ్గర పడింది. దాన్ని తిరిగి తీసినా మళ్లీ పెళ్లి కూతురు మెడలో వేయడానికి అతను ఇంట్రస్ట్ చూపించలేదు.
పెళ్లి కొడుకు ప్రవర్తనకు అక్కడికి వచ్చిన బంధువలంతా అవాక్కయ్యారు. అందరి ముందు పెళ్లి కొడుకు ఇలా చేయడం చూసి వధువు నిస్సహాయంగా నిలబడిపోవడం అందరికి బాధగా అనిపించింది. పెళ్లి కొడుకు ప్రవర్తనపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆమె అంటే ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందని, కానీ ఇలా అవమానించడం మాత్రం ఏ మాత్రం సరికాదని ఫైర్ అవుతున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసెయ్యండి.