బాలకృష్ణ హోస్ట్‌గా అలరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్‌లో హాస్య నటుడు బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్‌లుగా పాల్గొన్నారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్‌లతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ టాక్ షో ఆహాలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇక చాలా కాలంగా బిగ్‌స్క్రీన్‌కు దూరమైన హాస్య బ్రహ్మా బ్రహ్మానందం ఈ షో మూడో ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చారు.
ఆయన పలు విషయాలను బాలకృష్ణతో పంచుకున్నారు. వారి మధ్య జరిగిన సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి. అలాగే ఈ షోలో బాలకృష్ణ బ్రహ్మానందంపై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. బాలకృష్ణ కామెడీ చేస్తారు కానీ.. ఆయన కామెడియన్ కాదు సింహం అని బ్రహ్మానందం అనడంతో బాలయ్య సింహాల ఆయనపైకి గర్జిస్తూ వెళ్తారు.