బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి వార్తల్లో నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో వెర్సైట్ బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ అంటూ సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తొకటి హల్‌చల్ చేస్తుంది. చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఓ కీలక పాత్ర కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీని నటింప చేయాలని మేకర్స్ భావించి ఆయన్ని సంప్రదించగా ఆయన కూడా ఆసక్తికిని కనపపరిచారు. నెరేషన్ ఇవ్వాలని కోరారు. నవాజుద్దీన్ వంటి నటుడు సినిమాలో నటించడానికి ఆసక్తి చూపడమనేది దర్శకనిర్మాతలకు మరింత ఎనర్జీని ఇచ్చింది. త్వరలోనే నవాజుద్దీన్‌కి నెరేషన్ ఇవ్వడానికి డైరెక్టర్ బాబీ ముంబై వెళ్లబోతున్నారట.
వరుస సినిమాలను లైన్‌లో పెట్టుకుని ఎదురుచూస్తున్న చిరంజీవి కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు కాస్త మెరుగుపడిందో లేదో ఆచార్య సినిమాను ట్రాక్ ఎక్కిస్తున్నారు.
దీని తర్వాత లూసిఫర్ రీమేక్‌లో నటించాల్సి ఉంది. దీని తర్వాతే బాబీ సినిమా స్టార్ట్ అవుతుంది. మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు తెలుగులో మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. నయనతార ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కనిపించనుందని అని వినికిడి.పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
చిరంజీవి నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రాన్ని చేస్తున్నారు. ‘ఆచార్య’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది.