సినీ స్టార్స్ అయితే పేరుకి పేరు వస్తుంది. డబ్బుకి డబ్బు అందుతుంది. వారు ఏది కోరుకుంటే అది వాళ్ళ ముందు వచ్చి వాలుతుంది. కానీ.., సినీ సెలబ్రెటీలకి ఉండనిదల్లా ఒక్కటే.. అదే ఏకాంతం. వాళ్ళకంటూ ఇక పర్సనల్ లైఫ్ ఉండదు. ముఖ్యంగా ఏ సోషల్ మీడియా సైట్స్ వాడకం ఎక్కువ అయ్యాక.., సెలబ్రెటీలకు తల నొప్పులు తప్పడం లేదు. తాజాగా ప్రముఖ భోజ్‌పురి నటి త్రిషకర్ మధుకి కూడా ఇలాంటి కష్టమే వచ్చింది.
భోజ్‌పురి నటి త్రిషకర్ ఇప్పుడిపుడే కెరీర్ లో ఎదుగుతుంది. అయితే.. ఇప్పుడు ఆమె ప్రైవేటు వీడియో ఒకటి లీకైంది. త్రిషకర్ బాయ్ ప్రెండ్‌తో ఏకాంతంగా గడుపుతున్న వీడియో ఇది. దీంతో.., ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనతో షాకైన త్రిషకర్ మధు తనకి జరిగిన డ్యామేజ్ పై స్పందించింది. ” దేవుడు అన్నీ చూస్తున్నాడు. కొందరు కావాలనే నా పరువు తీయడానికి వీడియోను లీక్ చేసి వైరల్ చేస్తున్నారు. జనాలు ఇంత చీప్‌గా ఆలోచిస్తారని అసలు ఊహించలేదు’ అంటూ ట్వీట్ చేసింది. అయితే వీడియో బయటకు ఎలా వచ్చింది అనే దానిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. కాగా “హమ్ హై హిందుస్తానీ” అనే భోజ్‌పురి సీరియల్‌తో అరంగేట్రం చేసిన బెంగాలీ నటి త్రిషకర్ మధు ఆ తర్వాత పలు ఐటెమ్ సాంగ్స్‌లో నటించి మెప్పించింది.