బీహార్- మీరు ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు అడుక్కునే వాళ్లు ఎదురవుతుంటారు. ముసలి వాళ్లు, చిన్న పిల్లలను ఎత్తుకుని బిచ్చగాళ్లు అడుక్కుంటుంటారు. ఐతే బిచ్చగాళ్లు బిచ్చం అడగ్గానే చాలా మంది చెప్పే మాట చిల్లర లేదని. ఇలా చెబితే బిచ్చగాళ్లు మాత్రం ఏంచేస్తారు చెప్పండి, చేసేది లేక సైలెంట్ గా మరొకరి దగ్గరకు వెళ్తారు.
ఐతే ఇకపై ఇలా చిల్లర లేదంటే మాత్రం కుదరదు. ఏందుకంటే బిచ్చగాళ్లు సైతం డిజిటల్ పేమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. అవును ఇప్పుడు అడుక్కునే వాళ్లు సైతం డిజిటర్ పేమెంట్ చేయమని అడుగుతున్నారు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా, ఐతే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు.
బీహార్ లో ఓ భిక్షగాడు అంతా బిచ్చం వేయమని అడిగితే, చిల్లర లేదని చెబుతుండటంతో ఏ ఉపాయం ఆలోచించాడు. అదే డిజిటల్ పేమంట్. మెడలో డిజిటల్ పేమెంట్ స్కానర్ కార్డును వేసుకుని, చిల్లర లేకపోయినా ఫర్వాలేదని చెబుతున్నాడు. ఫోన్ పే, గూగుల్ పే ద్వార ధర్మం చేయమని సింపుల్ గా చెబుతున్నాడు.
బీహార్ లోని బెటయ్య ప్రాంతంలో రాజు ప్రసాద్ అనే వ్యక్తి అడుక్కుని జీవనం సాగిస్తున్నాడు. ఐతే ఈ మధ్య మెడలో క్యూ ఆర్ కోడ్ కోర్డును మెడకు తగిలించుకుని, చిల్లర లేకపోతే ఇబ్బంది పడకండి అని అంటున్నాడు. డిజిటల్ పేమెంట్ ద్వార ధర్మం చేయండని నవ్వుతూ అడుక్కుంటున్నాడు. గూగుల్ పే లేదంటే ఫోన్ ద్వారా డిజిటల్ రూపంలో బచ్చం వేయండని ఏ మాత్రం మొహమాటం లేకుండా అడుక్కుంటున్నాడు.