ఫిల్మ్ డెస్క్- అన్ స్టాపబుల్.. ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో ప్రసారం అవుతున్న ఈ షో ఎంత పాపులర్ అయ్యిందో తెలుసు కదా. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని ఈ షో అలరిస్తోంది. దేశంలోని ఎంటర్టైన్ మెంట్ రంగంలో అన్ స్టాపబుల్ షో నెంబర్ వన్ అయ్యిందంటే ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. ఈ షోలో బాలకృష్ణ తనదైన మ్యానరిజం, డైలాగ్స్, లుక్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు.
అన్ స్టాపబుల్ మొదటి సీజన్ ముగుస్తుండటంతో ఈ షో రెండో సీజన్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీజన్ కూడా మరో లెవెల్ లోనే సెట్ చేస్తుంది ఆహా టీం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే..ఈ షో ఇంత సక్సెస్ కావడానికి బాలకృష్ణ ఒక కారణమైతే, తెర వెనక దీని కోసం ఎంతో మంది కష్టపడ్డారు. వీరిలో బాలయ్య రెండవ కూమార్తె తెజస్వీని కూడా ఉండటం విశేషం.
అన్ స్టాపబుల్ షోకు తేజస్వీని కూడా పనిచేసిందట. ఈ విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అన్ స్టాపబుల్ షోకు రైటర్ గా పనిచేస్తున్న బీవీఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బాలయ్య అన్ స్టాపబుల్ షో కోసం బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా పనిచేశారని ఆయన చెప్పారు. బాలయ్యను కొత్తగా చూపేందుకు తేజస్విని చాలా రీసెర్చ్ చేశారని, అన్‌స్టాపబుల్ టీమ్ తో పనిచేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.