ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే ఓ సంచలనం. ఎందుకంటే ఒకప్పుడు భారత్ తో గొప్ప సినీమా దర్శకుల్లో ఒకరైన ఆర్జీవి, ఇప్పుడు తన రూటే సపరేటు అంటున్నారు. వరుస వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ నుంచి మొదలు, యాంకర్స్ ఇంటర్వూలతో అదరగొడుతున్నారు. అరియాన ఇంటర్వూతో సంచలనం రేపిన వర్మ, ఇప్పుడు అషూ రెడ్డి ఇంటర్వూతో కాక పుట్టిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేస్తే చాలు స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫేమస్ అవ్వొచ్చు అని లేడీ యాంకర్లు భావిస్తున్నారు. అలా ఎంతో మంది యాంకర్లు యూట్యూబ్‌లో ఇప్పుడు ఫేమస్ అయ్యారు. శృంగారం గురించి పచ్చి పచ్చిగా మాట్లాడుతూ, అరియానా శరీర భాగాలను వింత రీతిలో వర్ణించారు ఆర్జీవి. అలా వర్మ చేసిన ఆ చిట్ చాట్ కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇక ఇప్పుడు రాంగోపాల్ వర్మ కన్ను అషూ రెడ్డిపై పడింది. ఏకంగా ఆమె తొడల మీద తన ఫోకస్ పెట్టాడు వర్మ. అషూ రెడ్డిపై వర్మ పెట్టిన కెమెరా యాంగిల్ తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ చిట్ చాట్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఓ కాఫీ షాపులో అషూ రెడ్డి కూర్చుని వర్మ కోసం ఎదురుచూస్తూ ఉండగా, అప్పుడే ఆర్జీవీ అలా ఎంట్రీ ఇచ్చారు.
కాఫీ షాప్ లోకి ఎంటరవ్వగానే ఆర్జీవీ కన్ను అషూ రెడ్డి బ్యాక్ మీద పడింది. కాస్త తేరుకున్న తరువాత వర్మ తనని తాను అషూ రెడ్డికి పరిచయం చేసుకున్నాడు. అసలు నువ్ ఎవరు.. అంటూ తెలియనట్టుగా అషూరెడ్డి బాగానే నటించింది. నీ తొడలు బాగున్నాయ్ అంటూ వర్మ కాంప్లిమెంట్ ఇవ్వగా, చిరు కోపంతో వర్మను లాగి పెట్టి కొట్టేసింది అషూ రెడ్డి. ప్రోమోనే ఇలా ఉందంటే, ఇక మొత్తం ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో మరి.