బిగ్‌బాస్ షోతో పేరు తెచ్చుకున్న టీవీ యాంకర్లలో అరియానా గ్లోరీ ఒకరు. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన తర్వాత ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. సినిమాలు, సీరియల్స్‌తో రాని గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆమె పలు షోలతో బిజీబీజీ గడుపుతోంది. ఇక, అరియానా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తరచుగా తన ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. బుధవారం అరియానా తన తాజా ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘ మనలో మనకు కాన్ఫిడెన్స్ ఉండటం అనేది ప్రత్యేకమైనది’’ అని రాసుకొచ్చింది. ఆ ఫొటోల్లో.. పూల పూల గౌనులో అమాయకత్వాన్ని ఒలకబోసింది. తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతోంది.
అరియానా వేసుకున్న ఆ డ్రెస్‌ను ఫిరోజ్ డిజైన్ స్టూడియో రూపొందించింది. ప్రముఖ సెలెబ్రిటీ ఫొటోగ్రాఫర్ నవీన్ ఆ ఫొటోలను తీశాడు. ప్రస్తుతం అరియానా గౌను అందాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ డ్రెస్‌లో అరియానా చాలా అందంగా ఉందంటూ.. బ్యూటీ విత్ బ్రేయిన్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, అరియానా 2015లో ఓ ప్రముఖ స్టూడియోలో యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఓ వంట ప్రోగ్రామ్‌కు కూడా హోస్టింగ్ చేసింది. కిరాక్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘‘ నా బాయ్ ఫ్రెండ్ చాలా మంచోడు’ అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది. టిక్‌టాక్‌లోనూ తన సత్తా చాటింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్ మరింత ఊపందుకుంది.