ఫిల్మ్ డెస్క్- జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కేవలం టీవీ షోల్లోనే కాదు, అడపాదడపా సినిమాల్లోను నటిస్తోంది. టీవీ షోలకు ధీటుగా సినిమా అవకాశాలు వచ్చినా, నటనకు ప్రాధాన్యం ఉన్న మంచి పాత్రలను మాత్రమే ఎంచుకుంటోంది అను. ఇక టీవీ షోల్లో చేసినా. సినిమాల్లో చేసినా తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది అనసూయ. అందుకే కాబోలు ఈ భామ డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు పోటీపడుతున్నారు.
తాజాగా అనసూయ థాంక్యూ బ్రదర్ సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈ మూవీ అంతగా ఆడకపోయినా అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక అను ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో అనసూయ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. పుష్ప సినిమా తర్వాత అనసూయ మరిన్ని ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. పుష్ప తరువాత అనసూయ చేస్తున్న సినిమాలో ఎయిర్‌హోస్టెస్ పాత్రలో కనిపించబోతోంది అను.
పేపర్‌బాయ్ సినిమాతో మంచి గురింపు తెచ్చుకున్న డైరెక్టర్ జయశంకర్ ఓ విభిన్నమైన కథాంశంతో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీలో మొత్తం ఆరు ముఖ్యమైన పాత్రలు ఉన్నాయట. ఇందులో ఎయిర్‌హోస్టెస్ పాత్ర చాలా కీలకమని అంటున్నారు. ఈ పాత్రలో అనసూయ నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో, అనసూయ వచ్చే నెల నుంచి జాయివ్ అవుతున్నట్లు సమాచారం.