ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తు పట్టారా?. ఈమె ఎవరో కాదు.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళంలో సినిమాలు చేసింది. కన్నడలో కూడా నటించి ఉంటే పాన్ ఇండియా యాక్ట్రెస్ అయిపోయేది.
సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు, రేర్ పిక్స్, గతంలో సినిమా షూటింగ్స్, ఫంక్షన్లకు సంబంధించిన ఇమేజెస్, వీడియోస్ లాంటివి కనిపిస్తే ఫ్యాన్స్, ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతుంటారు. హీరోయిన్స్ చిన్నప్పటి క్యూట్ ఫోటోస్ అయితే అందర్నీ ఆకట్టుకుంటుంటాయి. అలాగే ఓ పాపులర్ నటి చిన్నతనంలోని పిక్ నెట్టింట కనిపించింది. ఇంతకీ ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తు పట్టారా?. ఈమె ఎవరో కాదు.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళంలో సినిమాలు చేసింది. కన్నడలో కూడా నటించి ఉంటే పాన్ ఇండియా యాక్ట్రెస్ అయిపోయేది. తను ఎవరో కాదు, ఆసిన్ (Asin Thottumkal). ఈమధ్య ఆమె భర్త నుండి విడాకులు తీసుకోబోతుంది అనే వార్త ఎంతలా వైరల్ అయ్యిందో తెలిసిందే.
తర్వాత అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఆసిన్ 1985 అక్టోబర్ 26న కేరళలోని కొచ్చిన్లో జన్మించింది. 2001లో తన 15వ ఏట ‘నరేంద్రన్ మకన్ జయకాంతన్ వక’ (Narendran Makan Jayakanthan Vaka) అనే మలయాళం మూవీతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ తో తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది. తన అందం, అభినయంతో టాలీవుడ్ ఆడియన్స్ని ఆకట్టుకుని, తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ‘శివమణి’, ‘ఘర్షణ’, ‘లక్ష్మీ నరసింహా’, ‘చక్రం’, ‘గజిని’, ‘మజా’, ‘దశావతారం’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అన్నవరం’ తెలుగులో నటించిన చివరి చిత్రం.
ఆమిర్ ఖాన్ ‘గజిని’ తో హిందీ పరిశ్రమకు వెళ్లింది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ వంటి స్టార్ హీరోలతో ఆడి పాడింది. అలాగే తమిళంలో కమల్ హాసన్, విజయ్, అజిత్, విక్రమ్, సూర్య, జయం రవి తదితరులతో యాక్ట్ చేసింది. నటి, మోడల్, డ్యాన్సర్ అయిన ఆసిన్ పలు అవార్డులు అందుకుంది. 2016లో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ రాహుల్ శర్మను వివాహం చేసుకుంది. వీరికి ఆరిన్ అనే పాప ఉంది. పెళ్లి తర్వాత సినిమాలు చేయడం ఆపేసి, పర్సనల్ లైఫ్లో బిజీ అయిపోయింది.